డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పై కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రైవేటు వ్యక్తి కామేపల్లి తులసి బాబును అరెస్ట్ చేశారు. బుధవారం ఆరు గంటల పాటు కామేపల్లి తులసి బాబుని కేసు విచారణ అధికారి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విచారించారు. రఘురామ కృష్ణంరాజు గుండెలపై కూర్చొని టార్చర్ చేశాడని తులసి బాబు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆయనతో రిమాండ్ లో ఉన్న రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ తో పాటు కలిపి తులసి బాబు ని విచారించారు ఎస్పీ దామోదర్. విచారణ అనంతరం తులసి బాబు ని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.. వైద్య పరీక్షల అనంతరం ఆయనను గుంటూరు కోర్టులో హాజరుపరిచనున్నారు.
READ MORE: Former CM Jagan: “ఇది అత్యంత విచారకరం”.. తొక్కిసలాట ఘటనపై మాజీ సీఎం జగన్ రియాక్షన్..
ఇదిలా ఉండగా..రఘురామ కృష్ణంరాజు వైసీపీ ఎంపీగా ఉండగా, 2021 మే 14న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సీఐడీ కస్టడీలో ఉన్న తనపై భౌతకదాడి జరిగిందని రఘురామ కృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తునకు ప్రకాశం ఎస్పీ దామోదర్ ను ప్రభుత్వం నియమించింది. కేసు విచారణలో భాగంగా రఘురామపై కొందరు ప్రైవేటు వ్యక్తులు దాడి చేసినట్లు గుర్తించారు. అప్పటి సీఐడీ డీజీ సునీల్ కుమార్ వద్ద ప్రైవేటు సేవలు అందించిన తులసిబాబుపై అనుమానం వ్యక్తం చేస్తూ విచారణకు రమ్మంటూ ఎస్పీ దామోదర్ నోటీసులు జారీచేశారు. ఈ నోటీసుల ప్రకారం జనవరి 3వ తేదీ శుక్రవారం ప్రకాశం ఎస్పీ కార్యాలయానికి తులసిబాబు హాజరుకావాల్సి ఉంది. అయితే తాను విచారణకు రాలేనని, 7, 8 తేదీల్లో తనకు సమయం ఇవ్వాలని తులసిబాబు లేఖ రాయడం సంచలనంగా మారింది. తాజాగా తులసి బాబును విచారించిన పోలీసులు అరెస్ట్ చేశారు.
READ MORE: KTR : నేడు ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్