AP Assembly : నేడు మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. అయితే.. ఈరోజు ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రైతు రుణాలు, 9,10వ షెడ్యూల్ లో ఆస్తులు, తూర్పు కాపులకు బీసీ ధృవ పత్రం పై ప్రశ్నలపై చర్చ జరుగనుంది. అలాగే.. చంద్రన్న బీమా పథకం, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు, ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజ్ లు, విద్యా దీవెన, వసతి దీవెన అంశాల పై ప్రశ్నలు జరుగనున్నాయి. సభలో 9 కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సవరణ బిల్ -2023, గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ సవరణ బిల్లు -2023, ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ సవరణ బిల్-2023, ఆంధ్రప్రదేశ్ భూదాన్ అండ్ గ్రామ దాన్ సవరణ బిల్, ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీస్ సవరణ బిల్‌తో పాటు సభలో ఒక తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బుడ్గా జంగం సామాజిక వర్గాన్ని ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్ కులాల జాబితాలో తిరిగి చేర్చాల్సిందిగా తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కేంద్రానికి విఙప్తి చేస్తూ అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. మహిళా సాధికారత- రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.. అసైన్డ్ భూముల క్రమబద్దీకరణ, సమగ్ర భూ సర్వే, చుక్కల భూముల్లో సంస్కరణలు అసెంబ్లీ స్వల్పకాలిక చర్చలు జరుగనున్నాయి.
Also Read : Plane In Mud: బురదలో కూరుకున్న విమానం.. తీయడానికి వచ్చిన జేసీబీలు.. సూపర్ ల్యాండిగ్ ఫైలట్ జీ
Also Read
- TMC CRISIS: మమతా బెనర్జీకి షాక్.. రెబల్ వర్గంలో చేరిన కీలక అనుచరుడు..
- Ashwini Vaishnaw: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటన
- Pakistan: ‘‘అసిమ్ మునీర్ కండోమ్‌లు పంచుతాడా.?’’ పాక్ ఆర్మీ చీఫ్ కొత్త బాధ్యతలపై సెటైర్లు..
- Iran War: ట్రంప్ వార్నింగ్‌తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
అలాగే.. నేడు మూడో రోజు శాసన మండలి సమావేశాలు జరుగనున్నాయి. ఇవాళ ఉదయం పది గంటలకు మూడవ రోజు శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంతో పెద్దల సభ ప్రారంభం కానుంది. చేనేత కార్మికులకు ఆర్థిక సాయం, పీఎం ఆవాస్ యోజన, దేవాలయ భూముల పరిరక్షణ పై మండలిలో ప్రశ్నలు, తిరుమల యాత్రికుల భద్రత, రాష్ట్రంలో మహిళా సాధికారత, ఆరోగ్యశ్రీ పథకం, దిశా పై ప్రశ్నలు, మండలి ముందుకు రానున్న రెండు ప్రభుత్వ బిల్లులు, ఏపీ ఎస్ ఎస్ జి గ్రూప్ బిల్లు -2023, ఏపీ ఆధార్ బిల్లు -2023, దేవాలయాల అభివృద్ధి- ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పై స్వల్పకాలిక చర్చ జరుగనుంది.
Also Read : Sudhamurthy: ఆ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి
తాజావార్తలు
-
Nagarjuna: కొడుకు సక్సెస్ కోసం నాగార్జున తపన.. ‘లెనిన్’ స్క్రిప్ట్‌లో కింగ్ రైటింగ్!
-
CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొడతాం
-
Shravan Month Dreams: శ్రావణ మాసంలో మీ కలలో ఇవి కనిపిస్తే.. మీ దరిద్రం తీరిపోయినట్లే! అవి ఏంటో తెలుసా?
-
TMC CRISIS: మమతా బెనర్జీకి షాక్.. రెబల్ వర్గంలో చేరిన కీలక అనుచరుడు..
-
Jananayagan : విజయ్ లాస్ట్ మూవీతో కిరణ్‌కు తిప్పలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!