Nagarjuna: కొడుకు సక్సెస్ కోసం నాగార్జున తపన.. ‘లెనిన్’ స్క్రిప్ట్‌లో కింగ్ రైటింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarjuna: అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’. జూలై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా సక్సెస్ వెనుక చిత్ర యూనిట్ కష్టంతో పాటు కింగ్ నాగార్జున పడ్డ తపన కూడా ఎంతో ఉందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తన కొడుకు అఖిల్ ఈసారి ఎలాగైనా సరే బాక్సాఫీస్ వద్ద ఒక భారీ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాలని నాగార్జున ఎంతగానో కోరుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ‘లెనిన్’ చిత్రం కోసం ఏ స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారనే ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో అఖిల్ క్యారెక్టర్‌ను నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేసేందుకు నాగార్జున స్వయంగా రంగంలోకి దిగారట. కథలో మరింత బలం తీసుకురావడం కోసం, అఖిల్ పాత్రను మరింత పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేసేలా ఆయనే స్వయంగా ఒక స్పెషల్ సీన్‌ను రాసినట్లు తెలుస్తోంది. కేవలం సీన్ రాయడమే కాకుండా, దాని అవుట్‌పుట్ పక్కాగా రావడం కోసం నాగార్జున ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారట. ముఖ్యంగా సినిమాలో అత్యంత కీలకమైన అఖిల్ – నటుడు శివాజీ కాంబినేషన్లో వచ్చే ఆ ఎలివేషన్ సీన్‌ను చాలా కేర్‌ఫుల్‌గా నైట్ షూట్లో చిత్రీకరించినట్లు సమాచారం. అర్ధరాత్రి వేళ జరిగిన ఈ షూటింగ్లో నాగార్జున పర్యవేక్షణలోనే సీన్ మొత్తం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిందట. థియేటర్లలో ఈ సీన్‌ను చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు పూనకాలు రావడం ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి. కొడుకు కెరీర్ కోసం ఒక తండ్రిగా నాగార్జున పడ్డ ఈ కష్టం చూస్తుంటే అఖిల్ సక్సెస్ కోసం ఆయన ఎంతలా పరితపించారో స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ సరికొత్త ఇన్సైడ్ టాక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
తాజావార్తలు
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!