మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కంప్లిట్ టాలీవుడ్ స్టార్ గా మారిపోయాడు. సొంత ఇండస్ట్రీ కంటే కూడా తెలుగులోనే దుల్కర్ ‘లక్కీ భాస్కర్’ తో తొలిసారి వంద కోట్ల క్లబ్ లో చేరాడు. ఈ యంగ్ హీరో తెలుగులో మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ తో హ్యాట్రిక్ హిట్స్ కొట్టేసాడు. అదే జోష్ తో తెలుగులో మరో సినిమా చేస్తున్నాడు. గత ఏడాది దుల్కర్ బర్త్ డే కానుకగా పవన్ సాదినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఒక తార’ అనే సినిమాను ప్రకటించాడు. పవన్ సాదినేని దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమా ఇటీవల రెగ్యులర్ షూట్ స్టార్ట్ అయింది.
Also Read : Shabdham : వైశాలి సీక్వెల్ ‘శబ్దం’ ట్రైలర్ రిలీజ్
ఆకాశంలో ఒక తార సినిమా ద్వారా ‘సాత్విక వీరవల్లి’ అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతుంది. అయితే ఈ చిత్రంలో మరోక హీరోయిన్ కూడా నటిస్తోంది. చి.ల.సౌ సినిమాలో కథానాయకిగా నటించిన రుహాణి శర్మ ఇప్పుడు ఆకాశంలో ఒక తారలో నటిస్తోంది. ఈ బుధవారం సెట్స్ లో అడుగుపెట్టింది రుహాణి శర్మ. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్నఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలైన గీత ఆర్ట్స్ తో పాటు లైట్ బాక్స్ మీడియా, స్వప్న సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. ఈ సినిమాతో టాలీవుడ్ లో దుల్కర్ సల్మాన్ వరుసగా నాలుగవ హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.