తమిళ స్టార్ దర్శకుడు శంకర్ నిర్మాతగ అరివళగన్ దర్శకత్వంలో 2009లో వచ్చిన చిత్రం వైశాలి. యంగ్ హీరో ఆది పినిశెట్టి హీరోగా సింధు మీనన్ హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది. ఒక ఆత్మ తన చావుకు కారణమైన వారిపై నీటి రూపంలో రివెంజ్ తీర్చుకోవడం అనే కథాంశంతో తెరకెక్కిన విశాలి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కాగా ఇన్నాళ్లకు వైశాలి కి సీక్వెల్ గా శబ్దం ను తెరకెక్కించారు.
ఆది పినిశెట్టి హీరోగా దర్శకుడు అరివళగన్ తెరకెక్కించిన ‘శబ్దం’ లో లక్ష్మీ మీనన్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా శబ్దం ట్రైలర్ న రిలీజ్ చేసారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే ఈ సారి శబ్దంతో భయపెట్టేలా ఉన్నాడు దర్శకుడు. చనిపోవడంతోనే జీవితం అయిపోదు. చనిపోయాక కూడా ఇంకో జీవితం ఉంటుంది వంటి డైలాగ్ లు ఆకట్టుకున్నాయి. అలాగే మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఇచ్చిన నేపధ్య సంగీతం బాగా కుదిరింది. వైశాలి మాదిరి శబ్దం కూడా మెప్పించేలా ఉందని తెలుస్తోంది. 7జీ ఫిలింస్ పతాకంపై శివ నిర్మించిన ఈ సినిమాను తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 28న రిలీజ్ చేస్తున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్.సినిమాస్ విడుదల చేస్తున్న ఈ సినిమా థియేటర్స్ లో ఏ మేరకు సౌండ్ చేస్తుందో చూడాలి.