Anil Ravipudi: డైరెక్టర్ అనిల్ రావిపూడికి టాలీవుడ్‌లో సంక్రాంతి దర్శకుడిగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ వస్తుందంటే ఆ పండుగతో పాటు ఈ సక్సెస్‌పుల్ డైరెక్టర్ సినిమా కూడా వస్తుందనేలా ట్రెండ్ సెట్ చేశాడు అనిల్ రావిపూడి. ఈ ఏడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనిల్, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
READ ALSO: Lionel Messi: మెస్సీ రాకపై సచిన్ భావోద్వేగ వ్యాఖ్యలు.. నంబర్ 10 జెర్సీ బహూకరణ
ఈ సినిమాను కూడా సంక్రాంతి కానుకగా 2026 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలో సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి లుక్ గురించి మాట్లాడుతూ.. మెగాస్టార్‌కు లుక్ విషయంలో నో చెప్పినట్లు వెల్లడించారు. చిరంజీవి ఈ సినిమా కోసం ‘సాల్ట్ అండ్ పెప్పర్’ లుక్ ప్రయత్నిస్తానని చెప్పారని, కానీ దానికి వద్దన్నాని అన్నట్లు చెప్పారు. నిజానికి మెగాస్టార్‌కు ఆయన బయట ఎలా ఉన్నారో సినిమాలోనూ అలానే చూపిస్తానని చెప్పినట్లు తెలిపారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’లో మెగాస్టార్ హీరోయిన్‌గా నయనతార కనిపించనున్నారు. ఈ సినిమాలో ప్రత్యేకమైన అతిథి పాత్రలో హీరో విక్టరి వెంకటేశ్ కనువిందు చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రంలో చిరు- వెంకీ కాంబినేషన్‌లో సీన్స్ సుమారుగా 20 నిమిషాల పాటు ఉండనున్నట్లు సినీ సర్కిల్‌లో టాక్ నడుస్తుంది.
READ ALSO: CM Chandrababu: హైదరాబాద్ కు సీఎం చంద్రబాబు.. ఎందుకంటే..?