Lionel Messi: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ముంబై పర్యటనను భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ “ముంబైకి, దేశానికి ఒక స్వర్ణ క్షణం”గా అభివర్ణించారు. తాజాగా ముంబైలో జరిగిన కార్యక్రమంలో సచిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మెస్సీ, అతని సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ తో కలిసి ముంబైకి వచ్చారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. ఈ మైదానంలో నేను ఎన్నో అద్భుత క్షణాలను అనుభవించాను. ముంబై కలల నగరం. అనేక కలలు ఈ వేదికపై సాకారం అయ్యాయి. అభిమానుల మద్దతు లేకపోతే, 2011లో ఈ మైదానంలో మేము ఆ స్వర్ణ క్షణాన్ని చూడలేకపోయేవాళ్లం అని అన్నారు. ఇక ఈ రోజు ఈ ముగ్గురు గొప్ప ఆటగాళ్లు ఇక్కడ ఉండటం ముంబైకి, ముంబై ప్రజలకు, భారతదేశానికి నిజంగా ఒక స్వర్ణ ఘట్టం. మీరు వారిని స్వాగతించిన తీరు అసాధారణం అని సచిన్ అన్నారు.
అయితే మెస్సీ ఆట గురించి మాట్లాడేందుకు ఇది సరైన వేదిక కాదని, ఎందుకంటే అతడు తన కెరీర్‌లో అన్ని సాధించాడని సచిన్ అన్నారు. లియో విషయానికి వస్తే ఏం చెప్పాలి? అతడు అన్నీ గెలిచాడు. అతడి అంకితభావం, పట్టుదల, నిబద్ధత మాకు ఎంతో ప్రేరణనిస్తాయని వ్యాఖ్యానించారు. మెస్సీ వినయాన్ని ప్రశంసించిన సచిన్, యువతను ప్రోత్సహిస్తున్నందుకు అతనికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో భారత ఫుట్‌బాల్ కూడా కోరుకున్న స్థాయికి చేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సచిన్, తన సంతకం చేసిన నంబర్ 10 జెర్సీని మెస్సీకి బహూకరించారు. దీనికి ప్రతిగా అర్జెంటీనా వరల్డ్‌కప్ విజేత కెప్టెన్ మెస్సీ సచిన్‌కు ఒక ఫుట్‌బాల్ అందజేశాడు. మెస్సీ ‘GOAT ఇండియా టూర్ 2025’లో భాగంగా ముంబైకి వచ్చారు. భారీ భద్రత నడుమ ఆయన మధ్యాహ్నం ముంబై చేరుకున్నారు. ఇది ఆయన నాలుగు నగరాల పర్యటనలో రెండో రోజు. సోమవారం ఆయన న్యూఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు. దీనితో భారత్ పర్యటన ముగియనుంది. శనివారం తెల్లవారుజామున మెస్సీ భారత్‌కు చేరుకున్నప్పటికీ.. కోల్‌కతా పర్యటనలో గందరగోళం, భద్రతా లోపాలు చోటుచేసుకున్నాయి. అయితే హైదరాబాద్ పర్యటన మాత్రం ప్రశాంతంగా సాగి, సానుకూలంగా ముగిసింది.
After watching the events in Kolkata, Hyderabad, and Mumbai.
It was clear that while Messi met many celebrities, he seemed to ignore most of them. but when he met Sachin Tendulkar, the respect was unmistakable.
A true GOAT recognizing another GOAT 🐐pic.twitter.com/QVJVstLkFQ
— GillTheWill (@GillTheWill77) December 14, 2025