Flood Alert: ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మొదటి ప్రమాద హెచ్చరిక చేరువలో ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీలు ఉన్నాయి. గోదావరి గలగల పరుగులు పెడుతుంది. భద్రాచలం వద్ద 44.9 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద ఇన్, ఔట్ ఫ్లో 9.88 లక్షల క్యూసెక్కులు. 11 నుంచి 12 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం చేరే అవకాశం ఉంది.
ఈ రోజు ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Andhra Pradesh Heavy Rains Alert: మధ్య బంగాళాఖాంతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. రేపటికి అల్ప పీడనంగా బలపడే అవకాశం ఉంది. ఆరు రోజులపాటు ఏపీకి విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉంది.. నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. రేపు కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.. ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు,బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లా రేపు భారీ నుంచి అతి భారీ…