Flood Alert: ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మొదటి ప్రమాద హెచ్చరిక చేరువలో ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీలు ఉన్నాయి. గోదావరి గలగల పరుగులు పెడుతుంది. భద్రాచలం వద్ద 44.9 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద ఇన్, ఔట్ ఫ్లో 9.88 లక్షల క్యూసెక్కులు. 11 నుంచి 12 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం చేరే అవకాశం ఉంది.