రాష్ట్ర వ్యాప్తంగా మే 7 నుంచి రైస్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేపట్టామని.. E-KYC తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసినట్లు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కార్డును E-KYC చేశామని.. దేశంలో 95 శాతం ఈకైవైసీ పూర్తి చేసుకున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 4,24,59,028 మందికి ఈకైవైసీ పూర్తి అయ్యిందని.. 22,59,498 మంది కి మాత్రమే ఈకేవైసీ పూర్తికాలేదని…
మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ అరెస్ట్‌కు ఏపీ పోలీసుల యత్నం అన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. సీమెన్స్ కేసులో తమకు తెలిసిన సమాచారం ఇవ్వాలంటూ అప్పటి అధికారులకు ప్రశ్నావళి ఇవ్వడానికి వెళ్ళిన డీఎస్పీ. దర్యాప్తునకు అవసరమైన సమాచారాన్ని సేకరించే ప్రయత్నం. దీన్ని వక్రీకరించి అరెస్టుకు యత్నం అంటూ ప్రచారం దురదృష్టకరం అని అధికారులు వివరణ ఇచ్చారు, పీవీ రమేష్ అరెస్టు అనేది అవాస్తవం. ఆయన ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో అధికారులు తిరిగి వచ్చేశారు. పీవీ రమేశ్…