Odisha: మరీ ఇంత దారుణమా? గిరిజన యువతిపై అసభ్య ప్రవర్తన.. మానవ మలాన్ని నోటిలో..
- ఒడిశాలోని బోలంగీర్ జిల్లాలో దారుణం
- గిరిజన యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన
- మానవ మలాన్ని నోటిలో పోసిన వ్యక్తి
- స్టేషన్లో ఫిర్యాదు చేసిన యువతి
- వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశాలోని బోలంగీర్ జిల్లాలో ఓ గిరిజన యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆ వ్యక్తి (మానవ) మలాన్ని బలవంతంగా నోటిలో పోశాడు. ఈ ఘటన బంగముండ పోలీస్ స్టేషన్ పరిధిలోని జూరబంధ గ్రామంలో చోటుచేసుకుంది. నిందితుడు 20 ఏళ్ల యువతిపై దాడి చేసి వేధించాడని చెబుతున్నారు.
ఆ మహిళ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
READ MORE: Leopard: చిరుతను చంపి.. వండుకుని తిన్నారు.. ఎక్కడంటే?
Also Read
ఫిర్యాదు ప్రకారం.. గిరిజనేతరుడైన నిందితుడు మహిళ పొలంలో నుంచి ట్రాక్టర్‌ను తీసుకెళ్తున్నాడు. దీంతో పంటలకు నష్టం వాటిల్లింది. దీనిపై మహిళ నిరసన వ్యక్తం చేస్తూ ట్రాక్టర్‌ను తమ పొలంలో నుంచి తీసుకెళ్లవద్దని కోరింది. ఆ సమయంలో నిందితులు ఆమెపై దాడి చేశాడు. మహిళను దుర్భాషలాడుతూనే, నిందితుడు ఆమె కులం మీద కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు ఘర్షణ పెరగడంతో.. బలవంతంగా ఆమె నోటిలో మానవ మలాన్ని పోశాడు. ఘటన అనంతరం నిందితుడు పరారీలో ఉన్నాడు. యువతి ఫిర్యాదు మేరకు బంగోముండ పోలీసులు 288/24 కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
READ MORE: Side Effects of Over Sitting: ఎక్కువ సేపు కూర్చుంటున్నారా? .. ఎంత ప్రమాదమంటే?
కాగా, నిందితులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రతిపక్ష బిజూ జనతాదళ్ (బిజెడి) ఎంపీ నిరంజన్ బీసీ ఆరోపించారు. దీని కారణంగా గిరిజనులలో ఆగ్రహం వ్యక్తమైంది. ఘటన అనంతరం స్థానిక గిరిజన సంఘాలు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. తక్షణమే అధికారులు చర్యలు తీసుకోకుంటే ఐక్యంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!