ఒడిశాలోని బోలంగీర్ జిల్లాలో ఓ గిరిజన యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆ వ్యక్తి (మానవ) మలాన్ని బలవంతంగా నోటిలో పోశాడు. ఈ ఘటన బంగముండ పోలీస్ స్టేషన్ పరిధిలోని జూరబంధ గ్రామంలో చోటుచేసుకుంది. నిందితుడు 20 ఏళ్ల యువతిపై దాడి చేసి వేధించాడని చెబుతున్నారు. ఆ మహిళ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.