Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas Fauzi Glimpse: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నుంచి వచ్చిన ‘ఫైల్ నెం.25 : ఫౌజీ’ ఒరిజినల్ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో, నేతాజీ సుభాష్ చంద్రబోస్ – అడాల్ఫ్ హిట్లర్ మధ్య సాగే సీరియస్ సంభాషణతో మొదలయ్యే ఈ వీడియోలో డార్లింగ్ ఫ్యాన్స్‌కి మామూలు హై ఇవ్వదు.
“రెండు వందల ఏళ్లుగా బ్రిటీషర్ల కింద బానిసలుగా ఉన్న మీ రక్తం ఓడిపోయే యుద్ధం చేస్తుంది, నేను మద్దతివ్వను” అని హిట్లర్ కించపరిచేలా మాట్లాడగా.. “భారతీయుల గురించి నీకేం తెలీదు హిట్లర్.. నీ సపోర్ట్ ఉన్నా లేకపోయినా నా దేశానికి స్వాతంత్య్రం తెచ్చి తీరతా” అని బోస్ బదులిచ్చే సీన్ పీక్స్‌లో ఉంది. అక్కడితో ఆగకుండా సింగపూర్‌లో బ్రిటీష్ సేనలను జపాన్ ఎలా చిత్తు చేసిందో వివరిస్తూ.. “కేవలం ఒక్క భారతీయుడు బ్రిటీష్ ఇంటెలిజెన్స్‌ను కుప్పకూల్చాడు, వాళ్ల ఆపరేషన్లను దెబ్బతీశాడు. సైనికుడు, వ్యూహకర్త, అలాగే స్పై అయిన అతనే ఫౌజీ” అంటూ బోస్ రివీల్ చేసే విధానం సినిమాపై హైప్‌ను ఆకాశానికి తీసుకెళ్లింది.
Also Read
అంతేకాదు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన హిట్లర్ ‘ఎనిగ్మా’ కోడ్ కంటే భగవద్గీత ఆధారంగా మన ‘ఫౌజీ’ సృష్టించిన సీక్రెట్ కోడ్‌ను క్రాక్ చేయడం బ్రిటీషర్లకు అసాధ్యంగా మారిందనే పాయింట్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. చివర్లో ప్రభాస్ పవర్ఫుల్ వాయిస్‌తో “హే బ్రిటీషర్.. నీ రక్తాన్ని కళ్లజూసి నా దేశ స్వాతంత్య్రాన్ని బలంగా లాక్కుంటా” అంటూ చెప్పే భారీ డైలాగ్ గ్లింప్స్‌కే హైలైట్‌గా నిలిచింది. పీరియాడిక్ వార్ డ్రామాగా రూపొందుతున్న ఈ భారీ చిత్రం 2027 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
తాజావార్తలు
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: తెలంగాణ బీజేపీలో ఆ నేతలెవరు? |
-
Srinidhi Shetty: ఆ ఛాన్స్ ఎలా వచ్చిందో నాకే తెలీదు
-
Aadarsha Kutumbam Trailer: ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్లో వెంకీ మామ వైలెంట్ అవతార్ చూశారా!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!