కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో తమ పట్ల ల్యాబ్ టెక్నీషియన్, మరొక ఎంప్లాయ్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.. దీనిపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు.. ల్యాబ్ టెక్నీషియన్ కల్యాణ్ చక్రవర్తి, జిమ్మి అనే ఇద్దరు ఉద్యోగులు.. తమ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు చెప్తున్నారు స్టూడెంట్స్.
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పీఎస్ పరిధి అవూశాపూర్ లోని విబీఐటి కళాశాలలో దారుణం చోటుచేసుకుంది. కాలేజీ వార్డెన్ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. విద్యార్థినుల అసభ్యకర ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. హాస్టల్ విద్యార్థినులు షార్ట్స్ వేసుకుని ఉండగా వార్డెన్ ఫోటోలు తీస్తున్నాడంటూ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల అసభ్యకర ఫోటోలు తీసి మిత్రులకు పంపాడని వార్డెన్ పై ఆరోపణలు చేశారు. Also Read:India-Pak War: యుద్ధం వస్తే, భారత్-పాకిస్తాన్ బలాబలాలు ఏంత..? ఏ…
ఒడిశాలోని బోలంగీర్ జిల్లాలో ఓ గిరిజన యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆ వ్యక్తి (మానవ) మలాన్ని బలవంతంగా నోటిలో పోశాడు. ఈ ఘటన బంగముండ పోలీస్ స్టేషన్ పరిధిలోని జూరబంధ గ్రామంలో చోటుచేసుకుంది. నిందితుడు 20 ఏళ్ల యువతిపై దాడి చేసి వేధించాడని చెబుతున్నారు. ఆ మహిళ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితుడు విభవ్ కుమార్‌కు జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) సమన్లు జారీ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా స్వీకరించిన మహిళా కమిషన్ మే 17న ఉదయం 11 గంటలకు తన ఎదుట హాజరుకావాలని విభవ్ కుమార్‌ను ఆదేశించింది.
ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మహిళా ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో అతనిని అరెస్టు చేశారు. ముంబై-గౌహతి విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన హైదరాబాద్ దోమల్ గూడలో జరిగింది. గగన్ మహల్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ కీచక టీచర్ ఉదంతం బయటపడింది. పిల్లల ఫోటోలు తీస్తూ బెదిరించాడు, తాను చెప్పినట్లు వినాలంటూ వేధింపులకు గురిచేశాడు. ఈ కీచక టీచర్ శ్రీనివాస్ ప్రవర్తనతో విద్యార్థినులు స్కూల్ కు వెళ్లకుండా ఇంట్లో ఏడుస్తూ కూర్చున్నారు. తల్లిదండ్రులు విషయం తెలుసుకొని స్కూల్ లో టీచర్ ను నిలదీశారు. గత కొంతకాలంగా పిల్లలతో, తోటి…