Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: అంతన్నారింతన్నారు. మీకెందుకు మేం చూసుకుంటామంటూ ముందుకు తోసేశారు. ఎన్నికల ఖర్చులు కావాల్నా..? ఓస్ అదెంత పని, ఇట్టా.. నామినేషన్ వేసి బయటికి రాగానే.. అట్టా మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. టింగ్ టింగ్ మంటూ ఫోన్లో మెసేజ్‌ల మోత మోగిపోతుందని బిల్డప్‌లు ఇచ్చారు. తీరా సీన్లోకి వచ్చాక అక్కడి వైసీపీ ఇన్ఛార్జ్లు పూర్తిగా ముఖం చాటేశారట. ఆర్థిక భారం మోయలేక విపక్ష అభ్యర్థులు సతమతం అవుతోంది ఎక్కడ? ఎందుకలా?
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థులు ఎంత మంది నిలకడగా ఉంటారు? అదేంటీ….? అసలా ప్రశ్నేంటి? నామినేషన్స్ వేసింది పోటీ చేయడానికేకదా..? అంతలా పోరాటం చేస్తోంది ఎలక్షన్స్‌లో గెలవడానికే కదా.. అంటారా? మామూలుగా అయితే.. మీరనుకుంటున్నది కరెక్టేగానీ.. ఇక్కడ మాత్రం యవ్వారం బాగా తేడాగా ఉందట. నామినేషన్లు వేసే సమయంలో కనిపించిన హడావిడి… ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో కనిపించడం లేదన్న విమర్శలు వైసీపీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. పోటీకి సిద్ధమంటూ ముందుకొచ్చిన అభ్యర్థులు.. ఇప్పుడు ఎన్నికల ఖర్చుల గురించి ఆలోచిస్తూ తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. నామినేషన్ వేసే వరకు వెంటపడి ఒప్పించిన పార్టీ ముఖ్య నాయకులు.. అక్కడితో తమ బాధ్యత తీరిపోయిందన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. వాళ్ళని ముందుకు తోసి సైలెంట్‌గా సైడైపోయినట్టు చెప్పుకుంటున్నారు. దాంతో.. మీకెందుకు, మేం చూసుకుంటామన్న మాట విని యుద్ధానికి సిద్ధమైన అభ్యర్థుల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిలా మారిందని అంటున్నారు. ప్రతి వార్డులోనూ పార్టీ అభ్యర్థి ఉండాలన్నది వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశం. అందుకు తగ్గట్టే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మున్సిపాలిటీల్లో అభ్యర్థులను బరిలోకి దించారు. పోలింగ్ పూర్తయ్యే వరకు సపోర్ట్ చేయాల్సిన కొందరు నియోజకవర్గ కో – ఆర్డినేటర్లు నామినేషన్ తర్వాత మమ్మల్ని వదిలేశారంటూ చాలా మున్సిపాలిటీల్లో అభ్యర్థులు ఫీలవుతున్నట్టు తెలుస్తోంది.
Also Read
ఎన్నికల్లో అందర్నీ సమన్వయం చేసుకోవాలి, ఇంటింటి ప్రచారం చేయాలి. అవసరమైన ప్రచార సామగ్రిని సమకూర్చుకోవాలి. పోల్ మేనేజ్మెంట్ వీటన్నిటికంటే ముఖ్యం. ఇలా.. అన్నీ కలిపి ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఈ మాట ముందే చెబితే.. మీకెందుకు మేం చూసుకుంటామన్న ఇన్ఛార్జ్లు ఇప్పుడు పత్తా లేకుండా పోయారన్నది ఎక్కువ మంది అభ్యర్థుల కంప్లయింట్. ఆర్థిక బలం ఉన్నవాళ్లు కొంత వరకు మేనేజ్ చేయగలిగినా.. సాధారణ కుటుంబాలకు చెందిన వాళ్ళ పరిస్థితి మాత్రం ఇరకాటంలో పడ్డట్టు అయిందట. పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం.. పెద్దలు వెన్నుదన్నుగా ఉంటారనుకున్న వాళ్ళకు.. ఇప్పుడు ఖర్చుల భారం సవాల్‌గా మారుతోందన్న చర్చ జరుగుతోంది. ఏకగ్రీవాలకు ఇది కూడా ఒక కారణం అంటున్న వాళ్ళు కొవ్వూరు మున్సిపాలిటీలోని పరిణామాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. ఇన్ఛార్జ్లు చేతులెత్తేయడంతో ఆర్థిక పరంగా కంగారు పడుతున్న అభ్యర్థులు కూటమి ప్రలోభాలకు లొంగి వెనక్కి తగ్గుతున్నారన్న మాటలు జిల్లాలో గట్టిగానే వినిపిస్తున్నాయి. అమలాపురం మున్సిపాలిటీలోనూ ఆసక్తికర పరిణామం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు టీడీపీ, వైసీపీ అభ్యర్థులుగా నామినేషన్స్ వేశారు. వాళ్ళ మధ్య ముందుగానే కుదిరిన ఒప్పందం ప్రకారంపార్టీ నాయకులకు సమాచారం ఇవ్వకుండానే వైసీపీ అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో టీడీపీకి ఏకగ్రీవమైనట్టు తెలిసింది. అభ్యర్థిపై నమ్మకంతో అదే వార్డులో ప్రత్యామ్నాయం చూసుకోకపోవడం ఇబ్బంది అయిందన్నది వైసీపీ నేతల మాట. స్థానిక ఎన్నికల్లో ఎక్కువ పూసుకుంటడే.. అనవసరంగా చేతిలోని డబ్బు ఖర్చుపెట్టాలి, దానికి రిటర్న్ ఎలాగో తెలియదు, అలాంటప్పుడు కామ్‌గా ఉంటే పోలా అనుకుంటూ కొందరు కో – ఆర్డినేటర్లు వెనుకడుగు వేస్తున్నారని, దాని ఫలితమే ఇలాంటి వ్యవహారాలంటూ ఉమ్మడి తూర్పుగోదావరి ఫ్యాన్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మరికొందరు అప్పులు చేసి మరీ ప్రచారానికి సిద్ధమవుతున్నారట. కానీ.. స్థోమత లేక, పార్టీ అండగా ఉంటుందని భావించి పోటీకి దిగిన అభ్యర్థులకు అవసరమైన సహకారం అందకపోతే.. అంతిమంగా నెగెటివ్ అవుతుందన్నది కేడర్ మాట. ఈ పరిస్థితి ప్రత్యర్థులకు అడ్వాంటేజ్ అవుతుందని విశ్లేషిస్తున్నారు. పోల్ మేనేజ్మెంట్ విషయంలో నాయకత్వం సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంటుందని అంటున్నాయి వైసీపీ వర్గాలు. అమలాపురం ఏకగ్రీవాలు వైసీపీకి కొన్ని ప్రశ్నలను మిగిల్చాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్లు అభ్యర్థులకు అర్థికంగా అండగా నిలవకపోతే.. ఫైనల్‌గా హ్యాండ్సప్ చెప్పే పరిస్థితి వస్తుందంటూ కంగారు పడుతున్నాయి ఫ్యాన్ వర్గాలు. పోటీకి అభ్యర్థులు సిద్ధం.. మరి గెలిపించడానికి పార్టీ ఇన్ఛార్జ్లు సిద్ధమేనా..? అన్నది ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న.
తాజావార్తలు
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
-
OTR: తెలంగాణ బీజేపీలో ఆ నేతలెవరు?
-
Srinidhi Shetty: ఆ ఛాన్స్ ఎలా వచ్చిందో నాకే తెలీదు
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!