DGP Harish Kumar Gupta: “హింసకు పాల్పడితే ఉపేక్షించేది లేదు”.. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై డీజీపీ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP DGP Harish Kumar Gupta: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికల్లో అభ్యర్థులకు, ఓటర్లకు పూర్తి రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎనిమిది జిల్లాల్లో ఎన్నికలకు సంబంధించి 14 ఘటనలు నమోదయ్యాయని వెల్లడించారు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని, ఇప్పటికే 17 మంది నిందితులను గుర్తించినట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం నామినేషన్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించినట్లు డీజీపీ పేర్కొన్నారు. అభ్యర్థులను అడ్డుకున్నా, ఓటర్లను బెదిరించినా, గుంపులుగా వచ్చి హింసకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల ఆదేశాలను ధిక్కరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, ముఖ్యంగా నామినేషన్ కేంద్రాల ముట్టడి, రహదారుల దిగ్బంధం వంటి చర్యలపై ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. ఎన్నికల భద్రతపై అధికారులు పర్యవేక్షణ పెంచాలని, అందిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు.
ఎన్నికల ప్రచారానికి సంబంధించి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. ర్యాలీలు, సభలు, మైక్‌ల వినియోగంలో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలుంటాయని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పోలీసుల చర్యలు ఉంటాయని, రాజకీయ అనుబంధం ఆధారంగా ముందస్తు చర్యలు తీసుకోరాదని స్పష్టం చేశారు. శాంతిభద్రతల ఉల్లంఘన ముప్పు ఉంటేనే బైండోవర్ చర్యలు ఉంటాయని, అయితే బైండోవర్ చేసినంత మాత్రాన ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హత రాదని స్పష్టం చేశారు. సీసీటీవీ, డ్రోన్, వీడియో ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, హింస వెనుక ఉన్న నిర్వాహకులు, ప్రేరేపకులపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసులపై దాడులు చేసినా, అభ్యర్థులను బెదిరించినా లేదా ఆస్తులను ధ్వంసం చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్టబద్ధమైన ఎన్నికల ప్రక్రియను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని పేర్కొంటూ, ఎన్నికల ప్రశాంత నిర్వహణకు అందరూ సహకరించాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని ధిక్కరిస్తే ఎలాంటి పరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
Also Read
తాజావార్తలు
-
DGP Harish Kumar Gupta: “హింసకు పాల్పడితే ఉపేక్షించేది లేదు”.. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై డీజీపీ హెచ్చరిక
-
India-China Border: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత.. విదేశాంగ శాఖ కీలక ప్రకటన.!
-
Thaman: త్రివిక్రమ్ వల్లే ‘ఓజీ’ సాధ్యమైంది: మ్యూజిక్ డైరెక్టర్ తమన్
-
Trivikram: ఈసారి రొటీన్ కథ కాదు.. వెంకీతో కలిసి సరికొత్త ప్రయోగం చేశా
-
Uma Kashvi: ఫీల్డింగ్ టైమ్‌లో మైదానంలో కొండముచ్చు హల్చల్.. తరువాత ఏం జరిగిందంటే..?
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!