బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ నేడు కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. బీజేపీ నేతలు లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, వివేక్, జితేందర్రెడ్డితో కలిసి ఆయన మధ్యాహ్నం 12 గంటలకు అమిత్ షాను కలుస్తారు. ఈ సమావేశంలో బీజేపీ మిషన్ 30, ఎన్నికల ప్రణాళికపై రాష్ట్ర నేతలకు షా సూచనలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే.. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది బీజేపీ. కర్ణాటక తర్వాత తెలంగాణలో అనుకూల పవనాలు వీస్తున్నాయని బీజేపీ అధిష్ఠానం భానిస్తున్న నేపథ్యంలో.. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే.. రాష్ట్రానికి ఏం చేస్తున్నామో.. ఆ పార్టీ నేతలు ప్రజలకు వివరిస్తున్నారు.
Also Read : T20 cricket: పొట్టి క్రికెట్‌లో మరీ ఇంత చెత్త రికార్డా..?
అయితే.. పార్లమెంట్ ప్రవాస్ యోజన, ప్రజా గోస-బీజేపీ భరోసా వంటి కార్యక్రమాలు చేపట్టారు. మార్చి నుంచి పోలింగ్ బూత్ స్వశక్తికరణ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు బీజేపీ నేతలు.ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలకు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు ఢిల్లీకి రావాలని అధిష్ఠానం నుంచి పిలుపొచ్చింది.
Also Read : CM YS Jagan: రైతులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్.. ఇవాళే ఆ సొమ్ము పంపిణీ
ఈ క్రమంలోనే.. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అమిత్‌షాతో రాష్ట్ర నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, విజయశాంతి, గరికపాటి మోహన్‌రావు, వివేక్, జితేందర్‌రెడ్డి పాల్గొనున్నారు.
Also Read : Anjala Zaveri: ఏయ్.. వెంకీ హీరోయిన్.. చిరు విలన్ భార్యనా..?