CM YS Jagan: రైతులకు మరోసారి శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇవాళ గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్న ఆయన.. నాలుగో ఏడాది మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ నిధులు పంపిణీ చేయనున్నారు.. అంతేకాకుండా.. ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ కూడా చేపట్టబోతున్నారు.. ఇక, మంగళగిరి పర్యటన కోసం .. ఉదయం 9.50 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి.. ఉదయం10.35 గంటలకు తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలోని బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు.. నాలుగో ఏడాది మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ నిధుల పంపిణీకి బటన్ నొక్కనున్నారు.. ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీకి కూడా శ్రీకారడం చుడతారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కడం ద్వారా.. వర్చువల్ గా రైతుల ఖాతాల్లో సంబంధిత సొమ్ము జమ కాబోతోంది. ఇక, తెనాలి పర్యటన ముగించుకుని.. మధ్యాహ్నం 1.10 గంటలకు తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్..
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
కాగా, ఇప్పటికే వరసగా నాలుగో ఏడాది, ఈ ఏడాదికి మూడో విడతగా రైతన్నలకు ఒక్కొక్కరికి ఏటా రూ. 13,500 చొప్పున వరుసగా 3 ఏళ్ళు రైతు భరోసా – పీఎం కిసాన్ సాయం అందించడంతో పాటు నాలుగో ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో ఒక్కొక్కరికి రూ. 11,500 చొప్పున సాయం అందించింది జగన్ ప్రభుత్వం. నేడు మూడో విడతగా ఒక్కొక్కరికి మరో రూ. 2,000 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 51.12 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ. 1090.76 కోట్ల రైతు భరోసా సాయాన్ని ఇవాళ గుంటూరు జిల్లా తెనాలిలో బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగుచేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, ఆర్‌వోఎఫ్‌ఆర్ అటవీ, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతన్నలకు కూడా వైఎస్సార్ రైతు భరోసా క్రింద పంట పెట్టుబడి ఖర్చు భారాన్ని తగ్గించేందుకు ఏటా రూ. 13,500 రైతు భరోసా సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదే. ఇప్పుడు అందిస్తున్న సాయం రూ. 1,090.76 కోట్లతో కలిపి ఈ మూడున్నరేళ్ళలో వైఎస్ జగన్ ప్రభుత్వం రైతన్నలకు అందించిన మొత్తంలో కేవలం వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ సాయం మాత్రమే రూ. 27,062.09 కోట్లు అని ప్రభుత్వం పేర్కొంది.
రైతులకు భరోసా కలిగిస్తోన్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఏటా రూ. 13,500 – 5 సంవత్సరాలకు కలిపితే ఆ మొత్తం రూ. 67,500గా ఉంది. రైతన్నకు అదనంగా అందిస్తున్న మొత్తం రూ. 17,500. రైతు భరోసా క్రింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి అందిస్తున్న రైతు భరోసా సాయం రూ. 13,500. మొదటి విడత – ఖరీఫ్ పంట వేసే ముందు – మే నెలలో రూ. 7,500, రెండవ విడత – అక్టోబర్ నెలలో ఖరీఫ్ పంట కోత సమయం మరియు రబీ అవసరాల కోసం రూ. 4,000, మూడవ విడత – పంట ఇంటికి వచ్చే సమయాన, జనవరి–ఫిబ్రవరి నెలలో రూ. 2,000 అందిస్తోంది. మూడేళ్ళ తొమ్మిది నెలల్లో రైతన్నలకు జగనన్న ప్రభుత్వం అందించిన సాయం రూ. 1,45,751 కోట్లు. గతానికి భిన్నంగా శాస్త్రీయంగా, అర్హులెవరూ మిగిలిపోకుండా ఈ–క్రాప్ ఆధారంగా పంట నష్టాల అంచనా. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ గ్రామ సచివాలయాల్లో అర్హుల జాబితాలు ప్రదర్శించి మరీ, ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే పరిహారాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది ప్రభుత్వం.