తెలుగు స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ ను సంపాదించుకున్నారు.. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమా సీక్వెల్‌లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఆ సినిమా ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదలకు సిద్ధంగా ఉంది.. అల్లు అర్జున్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే.. తాజాగా తన భార్య గురించి ఒక పోస్ట్ చేశాడు.. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
ఈరోజు అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ల పెళ్లిరోజు.. నేటితో వీళ్ల పెళ్లి అయ్యి పదమూడు ఏళ్లు అయ్యింది.. ఈ క్రమంలో తన భార్య కోసం ఎమోషనల్ పోస్ట్ చేశాడు..మా పెళ్లయి 13 ఏళ్లయింది. నేను ఇలా ఉండటానికి కారణం నీతో ఉన్న అనుబంధం అని అయన పేర్కొన్నారు. నీ ప్రశాంతత నాకు చాలా బలాన్ని ఇస్తుంది. ఇలాంటి వార్షికోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ యానివర్సరీ క్యూటీ. అంటూ అల్లు అర్జున్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో తన భార్యతో దిగిన పోస్ట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈయన సుకుమార్ దర్శకత్వం లో వస్తున్న పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు.. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్‌తో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి.. ఇక సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..