Allola Indrakaran Reddy : అమిత్ షా పర్యటనలో సీసీఐ పునరుద్దరణ ఊసే లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదిలాబాద్ సభలో తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ఆరోపణల పట్ల అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా మాట్లాడిన దాంట్లో ఒక్క మాట కూడా నిజం లేదని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వానిది ‘డబుల్ ఇంజిన్’’ కాదు… మీది ‘ట్రబుల్ ఇంజిన్ సర్కార్’ అని ఎద్దేవా చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు. కారు స్టీరింగ్ కేసీఆర్ చేతుల్లో పదిలంగా ఉందని, మీజేపీ స్టీరింగ్ మాత్రం ఆదానీ లాంటి కార్పోరేట్ల అదానీ చేతుల్లో ఉందన్నారు.
బీజేపోళ్ళ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరని చెప్పారు. అమిత్ షా తెలంగాణకు ఎప్పుడొచ్చినా అడ్డగోలుగా మాట్లాడుతాడు. నోటికొచ్చిన ఆరోపణలు చేసి పోతడు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై ఆయనకు కొంచమైన అవగాహన ఉందా?. ఇక్కడ ఎన్ని అభివృద్ధి పనులు జరిగాయో ఆయనకు తెలుసా..?’’ అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలను అడిగితే తెలుస్తుందని ఆయన హితవు పలికారు. రైతు ఆత్మహత్యలు డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఆదివాసీల సంక్షేమంపై మాట్లాడే అర్హత అమిత్ షాకు లేదని తెలిపారు. బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వమని, బీజేపోళ్లా మాకు నీతులు చెప్పేది అని ప్రశ్నించారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా, ఆదిలాబాద్ లో సీసీఐ పునరుద్ధరణపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కేంద్రం నుంచి వచ్చినవారు ఒక విజన్ తో మాట్లాడాలని సూచించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తమ హక్కు అన్నారు. రాష్ట్రానికి కేంద్రం అదనంగా ఇచ్చింది ఏమీ లేదని చెప్పారు. అమిత్ షా.. తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. గత తొమ్మిదిన్నర తెలంగాణకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేసిందేమి లేదని మండిపడ్డారు.
రాజకీయ లబ్ధి పొందాలనే బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు నిధులు ఇస్తామని, సీసీఐని పునరుద్దరిస్తామని ఏవైనా హమీలు ఇస్తారని తెలంగాణ ప్రజలు ఆశించారని, కానీ రాజకీయ విమర్శలు చేసి పోయాడు తప్ప… ఆయన పర్యటన వల్ల తెలంగాణకు ఒరిగిందేమి లేదని తెలిపారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!