బీహార్ పరిణామాలతో ఇండియా కూటమిలో గందరగోళం నెలకొంది. అసలేం జరుగుతుందో అర్థం కాక నేతలు సతమతమవుతున్నారు. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్, ఆప్ పార్టీలు సింగిల్‌గానే లోక్‌సభ బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించాయి. తాజాగా జేడీయూ కూడా ఇండియా కూటమికి రాంరాం చెప్పబోతున్నట్లు తాజా పరిణామాలతో అర్థమవుతోంది. ఈ అనిశ్చితితో కూటమి నేతలు కన్‌ఫ్యూజ్‌తో తలలు పట్టుకుంటున్నారు. క్షణక్షణం రాజకీయాలు చకచక మారిపోతున్నాయి. లేటెస్ట్‌గా నితీష్ ఇస్తు్న్న ట్విస్టుతో నేతలంతా అయోమయానికి గురయ్యారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీ పోటీ చేసేది అక్కడి నుంచే..క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ నేత..
ఇదిలా ఉంటే బీహార్‌లో చోటుచేసుకున్న పరిణామాలను తెలుసుకునేందుకు ఇండియా కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ మాత్రం వారికి అందుబాటులోకి రావడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఈనెల 30న బీహార్‌లో ప్రవేశించనుంది. ఈ యాత్రలో పాల్గొవాలని నితీష్‌కు గతంలోనే కాంగ్రెస్ ఆహ్వానం పంపింది. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు స్వయంగా సోనియాగాంధీ ఫోన్ చేసినా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగానే నితీష్‌కుమార్ ఇలా చేశారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జన ఖర్గే, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా పదే పదే నితీష్‌కు ఫోన్ చేసినా ఆన్సర్ చేయలేదని సమాచారం. కూటమి నేతలు ఎవరు ఫోన్ చేసినా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ పరిణామాలతో నితీష్ ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్లిపోయినట్లుగానే నేతలు భావిస్తున్నారు. మరోవైపు ఇది విషయంపై మాట్లాడేందుకు ఆదివారం బీహార్ వెళ్తున్నట్లు ఖర్డే తెలిపారు. స్వయంగా కలుసుకుని విషయాలు తెలుసుకోబోతున్నట్లు వెల్లడించారు.
KTR: ఆటో ఎక్కిన కేటీఆర్.. ఎందుకో తెలుసా..?
వాస్తవానికి ఇండియా కూటమి ఏర్పాటులో నితీష్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. కానీ ఇండియా కూటమి అధ్యక్షుడిగా ఖర్గేను నియమించడంపై నితీష్ జీర్ణించుకోలేకపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ తీరు వల్లే నితీష్ కూటమి నుంచి వెళ్లిపోతున్నారని అఖిలేష్ యాదవ్ కూడా ఆరోపించారు. కూటమిలో చీలికలు రావడంతో కమలనాథులు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కొనేందుకు ఏర్పడిన ఇండియా కూటమి బీటలు వారితే పరిస్థితులు ఎటువైపు దారి తీస్తాయో మరికొన్ని రోజులు ఆగాల్సిందే.