Rahul Gandhi: 2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తు్న్న నేపథ్యంలో దేశంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. అన్ని పార్టీలు తన ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ఈ సారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయం ఆసక్తిగా మారింది. అయితే దీనికి ఆ పార్టీ నేత, ఎంపీ కే మురళీధరన్ క్లారిటీ ఇచ్చారు. రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఎంపీగా ఉన్న కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచే పోటీ చేస్తారని చెప్పారు.
Read Also: Peddireddy Ramachandra Reddy: ఆయనకే గ్యారెంటీ లేదు.. ఆయన ఇచ్చే గ్యారెంటీలను ఎవరు నమ్ముతారు..?
కేరళలో ఒక్క కన్నూర్ మినహా సిట్టింగ్ ఎంపీలంతా సిట్టింగ్ స్థానాలను నుంచే పోటీ చేస్తారని చెప్పారు. రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తారని, దాంట్లో ఎలాంటి మార్పు లేదని ఆయన అన్నారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఉత్తర్ ప్రదేశ్ అమేథీ నుంచి కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేశారు. అయేథీలో బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. వయనాడ్‌లో అఖండ మెజారిటీలో గెలిచారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. ఇండియా కూటమిలో ఎలాంటి సమస్యలు లేవని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా పోరాడుతున్నామని చెప్పారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ గురించి మాట్లాడుతూ.. ఆయన కూటమిలో ఉంటే ఉండొచ్చని లేకుంటే ఆయన ఇష్టప్రకారం వెళ్లొచ్చని, కూటమిని అతడిని బయటకు వెళ్లాలని ఫోర్స్ చేయదని అన్నారు. మమతా బెనర్జీతో పొత్తులపై చర్చలు కొనసాగుతున్నయని మురళీధరన్ అన్నారు. కేరళ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఇండియా కూటమి పార్టీల మధ్యే పోటీ ఉంటుందని, అక్కడి బీజేపీకి ఎలాంటి బలం లేదని ఆయన చెప్పారు.