కంగనా రనౌత్ నటించిన’ క్వీన్ ‘ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ కూడా ప్రేక్షకులలో ఈ సినిమాఫై క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు..అందుకే, ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా..అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. అయితే, ఇప్పుడు సీక్వెల్ కి సంబంధించి డైరెక్టర్ వికాస్ బాహ్ల్ అప్ డేట్ ను ఇచ్చారు.. త్వరలోనే ‘క్వీన్ 2’ సినిమా షూటింగ్ షురూ అవుతుందని ఆయన తెలిపారు. ‘క్వీన్’ సినిమా రిలీజై పదేళ్లు అవుతోంది. పెళ్లాయ్యాక హనీమూన్ వెళ్లాలి అనుకునే ఒక అమ్మాయి టికెట్స్ బుక్ చేస్తుంది. కానీ, పెళ్లి కొడుకు వివాహాన్ని రద్దు చేసుకుంటాడు. దీంతో తాను ఒక్కతే హనీమూన్ కి వెళ్తుంది. అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడింది.. ఎలాంటి వాళ్లను కలుసుకుంది..ఏం నేర్చుకుంది? అనేది ‘క్వీన్’ సినిమా కథ… ఈ సినిమా ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది..ఈ సూపర్ హిట్ మూవీని తెలుగు, తమిళ్లో కూడా రీమేక్ చేశారు.
తాజాగా డైరెక్టర్ వికాస్ బాహ్ల్ మాట్లాడుతూ ఇప్పటికీ ప్రేక్షకులు క్వీన్ సీక్వెల్ గురించి ప్రశ్నిస్తూనే ఉంటారు అని ఆయన అన్నారు. “సినిమా నిన్న, మొన్న రిలీజైనట్లు అనిపిస్తుంది. సీక్వెల్ గురించి ఎవరో ఒకరు నన్ను అడుగుతూనే ఉంటారు. సీక్వెల్ కథ రెడీ అయిపోయింది. డబ్బు కోసం తీయాలంటే నాలుగేళ్ల కిందటే ‘క్వీన్ – 2’ రిలీజ్ అయ్యేది. ‘క్వీన్’ సినిమా రేంజ్ లోనే సీక్వెల్ ఉండాలనే ఉద్దేశంతోనే ఇన్ని రోజులు టైం తీసుకున్నాం. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవుతుంది” అని వికాస్ బాహ్ల్ చెప్పారు. అయితే, ఈ మూవీలో కంగనా నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.. ఈ నేపథ్యంలో సీక్వెల్లో కూడా కంగానానే నటిస్తుందా లేదా వేరే హీరోయిన్ కి అవకాశమిస్తారా అనేది తెలియాల్సి ఉంది.