టాలీవుడ్‌లో తొలి బ్లాక్‌బస్టర్ కోసం యువ హీరో అక్కినేని అఖిల్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం దర్శకుడు మురళీకృష్ణ అబ్బూరు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘లెనిన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్‌లో మొదట్నుంచీ అనేక మార్పులు, చేర్పులు జరుగుతుండడం హాట్ టాపిక్‌గా మారింది. ముందుగా హీరోయిన్‌గా శ్రీలీలతో షూట్ చేసిన కొన్ని కీలక సన్నివేశాలను, ఆ తర్వాత హీరోయిన్ మార్పు కారణంగా భాగ్యశ్రీ బోర్సేతో మళ్లీ రీ షూట్ చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా, సినిమాటోగ్రాఫర్ మార్పు కూడా జరగడం, కొన్ని ముఖ్యమైన సీన్లను తిరిగి తీయడం వంటివి ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఇక తాజాగా, అఖిల్ పాత్రకు సంబంధించి ఒక ఆసక్తికరమైన రూమర్ ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది.
Also Read : Suriya-46 : సూర్య అభిమానులకు గుడ్ న్యూస్..
ఈ సినిమాలో అఖిల్ అంధుడి పాత్రలో కనిపించబోతున్నారనే టాక్ వైరల్ అవుతుంది. అయితే, ఇది సినిమా అంతటా ఉంటుందా లేక కథలో కీలకమైన కొన్ని సన్నివేశాల వరకే పరిమితం అవుతుందా అనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. అఖిల్ లాంటి ఎనర్జిటిక్ హీరో అంధుడి పాత్ర పోషిస్తే అది సినిమాకు పెద్ద ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఈ వైవిధ్యమైన ప్రయత్నంతోనైనా అఖిల్‌కు బాక్సాఫీస్ వద్ద తొలి భారీ హిట్ దక్కుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే వేసవిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.