తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే.. నేడు అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఏదో ఒక మూలన కూర్చుని వెహికల్స్ కు ఛలాన్లు వేసే పనిలో ఉంటున్నారని ఆయన విమర్శించారు. అయితే.. జనం ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్నారన్న అక్బరుద్దీన్.. వాళ్ల పైన కొద్దీగా దయ చూపండని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే గ్యాస్ పెట్రోలు డీజిల్ ధరలతో జనం పరేషాన్ అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో నుంచి బయటకు వస్తే ట్రాఫిక్ పోలీసులను చూసి పరేషాన్ అవుతున్నారని ఆయన అన్నారు.
Also Read : NIA Searches: ఐసిస్, అల్-ఖైదాతో సంబంధాలు.. ముంబై, బెంగళూరులో సోదాలు
ఈ ట్రాఫిక్ ఛలాన్లతో ఇబ్బంది పడుతుంది పేదవాళ్లేనని, చిన్న చిన్న ఛలాన్లు ఉంటే మాఫీ చేసే ఆలోచన చేయండని ఆయన కోరారు. అయితే.. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ నేటితో ముగియనుంది. రెండురోజులుగా 24 పద్దులపై చర్చించి ఆమోదించారు. మూడో రోజైన నేడు నీటిపారుదల, సాధారణ పరిపాలన, వాణిజ్యపన్నులు, వైద్యారోగ్యం, ఆర్థిక, పశుసంవర్ధక, హోం, వ్యవసాయ, సహకార, పంచాయతీ రాజ్, రవాణాశాఖ, గవర్నర్-మంత్రిమండలి పద్దులపై చర్చించనున్నారు. వీటితోపాటు వ్యవసాయ విశ్వవిద్యాలయం, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులపైనా చర్చజరుగుతోంది.
Also Read : Vizag Steel Plant Explosion: విశాఖ స్టీల్ ప్లాంట్ లో పేలుడు.. 9మందికి గాయాలు