ఐపీఎల్ టికెట్ల విక్రయాల్లో జరుగుతున్న అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి, దోషులపై చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) బోర్డ్ అవినీతి, అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ నియమించి విచారణ జరపాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కె. ధర్మేంద్రలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని సత్య నారాయణరెడ్డి భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన గత రెండు ఐపీఎల్ మ్యాచ్‌లకు టిక్కెట్లు లభించని క్రికెట్ ప్రేమికులు నిరాశకు గురయ్యారన్నారు. హెచ్‌సిఎ, సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్వాహకులు, పేటిఎమ్ అమ్మకాలు, పంపిణీలో పారదర్శకంగా లేదని వారు ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Perni Nani: నాపై విషం చిమ్ముతున్నారు.. పచ్చి అబద్ధాలు చెబుతున్నారు..
ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 25 సన్ రైజర్స్ హైదరాబాద్- రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగాల్సి ఉందని, ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లను గత శుక్రవారం విక్రయానికి పెట్టారని, అయితే టికెట్లను పేటిఎంలో అమ్మకానికి పెట్టిన క్షణాల్లోనే టికెట్లను అమ్ముడు పోయాయంటూ బోర్డ్ ప్రకటించారని తెలిపారు. దాదాపు 36 వేలకు పైగా టికెట్లను అమ్మకానికి పెట్టినా.. అరగంట గంటలోపే ఏ విధంగా అమ్ముడుపోతాయో హెచ్‌సీఏ, సన్ రైజర్స్ యాజమాన్యాలు రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Swami Paripoornananda: ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు నామినేషన్.. అలా అయితేనే ఉపసంహరణపై ఆలోచన..!
హెచ్‌సిఎ , సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్వాహకులు టికెట్లను బ్లాక్ మార్కెట్ ద్వారా అక్రమంగా విక్రయించారని ఆరోపించారు. గతంలో HCA , IPL నిర్వాహకులు టిక్కెట్ల విక్రయాల వివరాలను బహిర్గతం చేసేవారని.. కానీ ఇప్పుడు ఆ సమాచారం ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం టిక్కెట్ల విక్రయాన్ని ఆధార్ కార్డులకు అనుసంధానం చేయాలని వారు డిమాండ్ చేశారు. తక్షణమే బోర్డ్ టికెట్లకు సంబంధించిన వివరాలను పబ్లిక్ డొమైన్ లో పొందుపరచాలని, జవాబుదారీతనంగా ఉండాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా వ్యాపారంపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: KCR On Kavitha Arrest: కవిత అరెస్ట్పై స్పందించిన కేసీఆర్..