TDP and Janasena: టీడీపీ, జనసేనలో ఆరని టికెట్ల చిచ్చు.. బుజ్జగిస్తున్నా వినని నేతలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP and Janasena: ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల వ్యవహారంతో ఒక్కసారిగా కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తుల పర్వం తారాస్థాయికి చేరుకుంది. పొత్తులతో ఆశలు గల్లంతుకావడంతో నేతలంతా రోడెక్కుతున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీలో అసమ్మతి భగ్గుమంది. నియోజకవర్గ ఇంఛార్జి తిక్కారెడ్డికి అధిష్టానం టికెట్ కేటాయించలేదు. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నిరసనలు, ధర్నాలతో హోరెత్తించారు కార్యకర్తలు. రోడ్డుపైనే బైఠాయించి నిరసనలు చేపట్టారు. రహదారులపై టైర్లు దగ్ధం చేసి ఆందోళన చేశారు.
బెజవాడలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. మైలవరం, బెజవాడ వెస్ట్ సీట్ల విషయంలో రగడ కొనసాగుతోంది. రోడ్డెక్కి ఆందోళనకు దిగారు టీడీపీ, జనసేన కార్యకర్తలు. మైలవరం టీడీపీ సీటు బొమ్మసాని సుబ్బారావుకి ఇవ్వాలని గొల్లపూడి సెంటర్లో క్యాడర్ ఆందోళన చేపట్టారు. బెజవాడ పశ్చిమ సీటు బీజేపీకి వెళ్లే అవకాశం వుండటంతో, జనసేన నేత పోతిన మహేష్ అనుచరులు రాస్తా రోకో నిర్వహించారు. ఇరు పార్టీల కార్యకర్తల ఆందోళనలతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. పిఠాపురంలో అసమ్మతి సెగలు చల్లారడం లేదు. పిఠాపురం జనసేన అధినేత పవన్ కు కేటాయించడంతో, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ ఆందోళనకు దిగారు. ఆయన వర్గీయులు రెండ్రోజులుగా నిరసన ప్రదర్శనలు చేశారు. చంద్రబాబు పిలుపు మేరకు శనివారం ఆయన్ని కలుస్తున్నానని చెప్పారు పిఠాపురం వర్మ. కార్యకర్తలు సలహాలు, సూచనల మేరకు భవిష్యత్ నిర్ణయం తీసుకుంటానన్నారు.
Also Read
- Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
- Tirupati Double Murder: తిరుపతిలో జంట హత్యల కలకలం.. పెళ్లి వేడుకలో కత్తులతో దాడి..
- Ind vs Eng Playing XI: తప్పక గెలవాల్సిందే.! నేడు భారత్, ఇంగ్లాండ్ నాల్గవ టీ20.. ప్లేయింగ్ XI ఇదే..
- Pawan Kalyan: నేడు జనసేన కీలక సమావేశం.. నేతలకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
అమరావతిలోని చంద్రబాబు నివాసానికి అసంతృప్త నేతలు క్యూ కడుతున్నారు. మాజీ మంత్రి జవహర్ చంద్రబాబుతో మాట్లాడారు. అయితే జవహర్‌కు ఇప్పటివరకు టీడీపీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. దాంతో ఆయన రాజీనామా చేస్తారని ప్రచారం సాగుతోంది. రంపచోడవరంలో టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన వంతల రాజేశ్వరి అమరావతిలో ధర్నాకు దిగారు. చంద్రబాబు ఇంటి దగ్గర రాజేశ్వరితో పాటు రంపచోడవరం నుంచి వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అంగన్‌వాడీ కార్యకర్త మిరియాల శిరీషకు టీడీపీ టికెట్ కేటాయించడంపై వంతల రాజేశ్వరి అనుచరులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. వంతల రాజేశ్వరికి టికెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. వంతల రాజేశ్వరి వర్గంతో కలిసి చంద్రబాబు నివాసానికి వెళ్లిన మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు..పార్టీ పెద్దలతో మాట్లాడారు.
సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బి.కె పార్థసారథి ఇంటి దగ్గర ధర్మవరం టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. పొత్తులో భాగంగా ధర్మవరం టికెట్ బీజేపీకి కేటాయిస్తారంటూ ప్రచారం జరగడంతో పరిటాల శ్రీరామ్ వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పరిటాల శ్రీరామ్‌కే కేటాయించాలని నిరసన చేపట్టారు ధర్మవరం టీడీపీ కార్యకర్తలు. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని పరిటాల శ్రీరామ్ వర్గీయులను బీకే పార్థసారథి సముదాయించారు. అనకాపల్లి జిల్లా జనసేనలో టికెట్ల కేటాయింపుల వ్యవహారం చిచ్చుపెట్టింది. ఆ పార్టీకి రాజీనామా చేశారు నియోజకవర్గ ఇంఛార్జ్ పరుచూరి భాస్కరరావు. 14 రోజులుగా పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు ప్రయత్నించినా…అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. కొణతాల రామకృష్ణకు సీటు ఇచ్చే మందు ఒక్క మాట కూడా తనతో చెప్పలేదన్నారు. పవన్ కళ్యాణ్ తర్వాత మరో నాయకుడు జనసేనలో లేరని తెలిపారు. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. తనలా చాలా మంది జనసేన నియోజకవర్గ ఇంఛార్జులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.
తాజావార్తలు
-
Wamiqa Gabbi: సుమో రెజ్లర్‌ను బురిడీ కొట్టించి గెలిచిన వామికా గబ్బి.. వైరల్ అవుతున్న జపాన్ వీడియో!
-
Yamaha Aerox-e: భారత మార్కెట్లో యమహా ఏరోక్స్-ఇ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
Lenin Target : లెనిన్ హిట్ స్టేటస్ కోసం ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలంటే?
-
Tirupati Double Murder: తిరుపతిలో జంట హత్యల కలకలం.. పెళ్లి వేడుకలో కత్తులతో దాడి..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..