Wamiqa Gabbi: సుమో రెజ్లర్‌ను బురిడీ కొట్టించి గెలిచిన వామికా గబ్బి.. వైరల్ అవుతున్న జపాన్ వీడియో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wamiqa Gabbi: జపాన్ పర్యటనలో బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి చేసిన ఓ ఫన్నీ సుమో రెజ్లింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. భారీ సుమో రెజ్లర్‌ను తెలివిగా బురిడీ కొట్టించి గెలిచిన ఆమె స్టైల్ నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. ఈ వీడియో చూసిన తర్వాత వామికా నటన కేవలం సినిమాలకే పరిమితం కాదని, రియల్ లైఫ్‌లోనూ ఆమె పూర్తి ఎంటర్టైనర్ అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
వామికా గబ్బి తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. సుధీర్ బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఆమెకు ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం అందించలేదు. దీంతో ఆమె తన దృష్టిని బాలీవుడ్ వైపు మళ్లించారు. అక్కడ వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో మంచి గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో బిజీ హీరోయిన్గా కొనసాగుతున్నారు. ఇక తెలుగులో కూడా అడివి శేష్ ‘G2’ (గూఢచారి 2) లో కూడా నటించారు. తమిళంలో ‘జీని’, ‘DC’ వంటి చిత్రాలతో పాటు హిందీలోనూ పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి.
Also Read
- The Paradise: నాని 'ది ప్యారడైజ్' టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
- Ramayana : 'జై జై రామ్' పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'ఏష నాగుల' సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
ఇలాంటి బిజీ షెడ్యూల్ మధ్యలో జపాన్‌కు వెళ్లిన వామికా అక్కడి సంప్రదాయ సుమో రెజ్లింగ్‌ను కూడా ఆస్వాదించారు. అయితే కేవలం చూసి వెళ్లిపోకుండా స్వయంగా రింగ్‌లోకి దిగడమే కాదు, గెలిచి కూడా అందరినీ ఆశ్చర్యపరిచారు. మ్యాచ్ కోసం గాలితో నింపిన ప్రత్యేక సుమో సూట్ ధరించిన వామికా మొదట రింగ్‌లోకి చాలా సీరియస్‌గా ఎంట్రీ ఇచ్చారు. భారీ సుమో రెజ్లర్‌లా ఫోజులు ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనంతరం ప్రత్యర్థి సుమో రెజ్లర్‌తో షేక్ హ్యాండ్ చేసి, హగ్ ఇచ్చి సరదాగా మ్యాచ్‌ను ప్రారంభించారు.
మ్యాచ్ మొదలైన తర్వాత మాత్రం ఆమె ఎంత ప్రయత్నించినా ప్రత్యర్థి రెజ్లర్‌ను కదిలించలేకపోయారు. దీంతో బలం కంటే తెలివి ఉపయోగించాలని నిర్ణయించుకున్న వామికా ఒక్కసారిగా తన కంటిలో ఏదో పడినట్లు నటించడం ప్రారంభించారు. ఆమె ఇబ్బందిలో ఉందని భావించిన సుమో రెజ్లర్ సహాయం చేసేందుకు దగ్గరకు రాగానే, అదే అవకాశంగా తీసుకుని అతడిని ఒక్కసారిగా రింగ్ బయటకు నెట్టేశారు. అనూహ్యంగా జరిగిన ఈ పరిణామంతో అక్కడున్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు. విజయం సాధించిన వెంటనే రింగ్‌లోనే వామికా వేసిన డ్యాన్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ వీడియోను వామికా గబ్బి స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఇలాంటి ట్రిక్స్‌తో మ్యాచ్‌లు ఎలా గెలవాలో తెలుసుకోవాలంటే తన దగ్గర నోట్స్ తీసుకోవాలని సరదా క్యాప్షన్ జోడించారు. అంతే, వీడియో క్షణాల్లో వైరల్ అయిపోయింది. అభిమానులు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇంత అందంగా అడిగితే ఎవరైనా ఓడిపోతారని, ఈ కామెడీ టైమింగ్ సినిమాల్లో కూడా కనిపించాలనంటూ వేల సంఖ్యలో కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి జపాన్‌లో జరిగిన ఈ చిన్న సరదా పోటీ వామికా గబ్బిని మరోసారి సోషల్ మీడియా సెన్సేషన్‌గా మార్చేసింది.
- Tags
- cinema
- Wamiqa Gabbi
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?