Scientific Research: చాలా మందికి వయసు అయిపోతుంది చావుకు దగ్గరవుతున్నామనే భయం ఉంటుంది. చావును ఎదురించి చాలా కాలం పాటు జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కాలం గడుస్తున్నకొద్దీ మనిషి సగటు జీవితకాలం పెరుగుతోంది. అయితే, దానిని మరింత పెంచటానికి, ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్దీ సంభవించే శారీరక దుర్భలత్వాన్ని అధిగమించటానికి అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిశోధనల్లో సింగపూర్ సైంటిస్టులు ఓ కీలక అడుగు వేశారు. వయసు పెరుగుదలకు కారణమవుతున్న ఓ ప్రోటీన్‌ను వారు ఫస్ట్ టైం కనుగొన్నారు. ఈ ప్రోటీన్ ఉత్పత్తిని అడ్డుకోవడం ద్వారా వయసు పెరుగుతున్నా కొద్ది సంభవించే శారీరక క్షీణత ప్రక్రియ వేగాన్ని తగ్గించవచ్చని గుర్తించారు. తద్వారా సుదీర్ఘకాలం పాటు జీవించే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సింగపూర్‌లోని డ్యూక్-ఎన్‌యూఎ్‌స మెడికల్ స్కూల్ సైంటిస్టులు ఈ పరిశోధన నిర్వహించారు. మనుషుల్లో గుండె, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తుల పనితీరులో ఇంటర్‌ల్యూకిన్ అనే ప్రోటీన్ కీలక ప్రభావం చూపుతున్న విషయాన్ని వీరు గుర్తించారు. ఈ ప్రోటీన్ ఉత్పత్తి పెరుగుతున్నా కొద్దీ కాలేయంలో, పొట్టలో కొవ్వు పేరుకుపోతోందని, కండరాలు బలహీనపడుతున్నాయని వెల్లడి అయింది.
Read Also:Virat Kohli-BCCI: ఎలాంటి అపోహలు వద్దు.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ భరోసా!
సింగపూర్ శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగాలు నిర్వహించారు. వాటి నుంచి ఐఎల్-11 ప్రోటీన్‌ను తొలగించటం, ఐఎల్-11 నిరోధక చికిత్సను నిర్వహించారు. దీని ద్వారా ఎలుకల్లో.. వయసు పెరుగుతున్న కొద్దీ సంభవించే శారీరక క్షీణత, వ్యాధులు, బలహీనత మొదలైన వాటి నుంచి రక్షణ లభించింది. వాటి సగటు జీవితకాలం 24.9వారాలు పెరిగింది. 75 వారాల వయసులో ఉన్న ఎలుకల్లో (ఇది మనుషుల్లో దాదాపు 55 ఏళ్ల వయసుతో సమానం) ఐఎల్-11 నిరోధక చికిత్సను ప్రారంభించి అవి మరణించే వరకు కొనసాగిస్తే.. మగ ఎలుకల సగటు జీవితకాలం 22.5వారాలు, ఆడ ఎలుకల సగటు జీవితకాలం 25వారాలు పెరిగింది. ఆరోగ్య సమస్యలు తీసుకొచ్చే తెల్ల కొవ్వు బదులు క్యాలరీలను ఖర్చు చేసే బ్రౌన్‌ఫ్యాట్ ఉత్పత్తి ఎలుకల్లో మొదలైంది. గుండె సంబంధిత సమస్యల నుంచి కూడా వాటికి రక్షణ లభించింది. ఈ ఫలితాలపై డ్యూక్-ఎన్‌యూఎ్‌స డీన్ ప్రొఫెసర్ థామస్ కాఫ్‌మన్ మాట్లాడుతూ, ఐఎల్-11 ప్రోటీన్ గురించి తాజాగా వెల్లడైన అంశాలు.. వృద్ధులు మరింత ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించటానికి దోహదపడతాయని చెప్పారు. వయసు పెరుగుదల ప్రక్రియను తగ్గి్ంచే పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. మనుషుల జీవితకాలాన్ని ఒక ఏడాది కాలం పాటు పొడిగిస్తే.. 38 ట్రిలియన్ డాలర్ల (రూ.83,62,225 కోట్ల) సంపదను అది సృష్టిస్తుందని అంచనాలున్నాయి.
Read Also:Uganda Children: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. సీన్ రీక్రియేట్ చేసిన ఉగాండా చిన్నారులు..!