Virat Kohli-BCCI: ఎలాంటి అపోహలు వద్దు.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ భరోసా!
- శ్రీలంక పర్యటనలో బాధ్యతలు
- వన్డే జట్టులోకి కోహ్లీ
- బీసీసీఐకి విరాట్ భరోసా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli React on Gautam Gambhir Conflicts: టీమిండియా హెడ్ కోచ్‌గా భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎంపికయిన విషయం తెలిసిందే. శ్రీలంక పర్యటనలో గౌతీ బాధ్యతలు చేపట్టనున్నాడు. గంభీర్‌ను కోచ్‌గా ప్రకటించిన వెంటనే.. చాలా మంది క్రికెట్ అభిమానుల మదిలో ఓ ప్రశ్న మెదిలింది. అదే.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టులో కొనసాగుతాడా? లేదా? అని. వీరిద్దరి మధ్య ఐపీఎల్ 2023 సమయంలో చోటుచేసుకొన్న సంఘటనలే ఇందుకు కారణం. అయితే అవన్నీ గతమని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని వారు చెప్పకనే చెప్పడం గమనార్హం.
శ్రీలంక పర్యటనకు జట్ల ఎంపిక ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవాలని భావించారు. తన తొలి పర్యటన కాబట్టి సీనియర్లు అందరూ అందుబాటులో ఉండాలని గౌతమ్ గంభీర్ కోరాడు. రోహిత్, కోహ్లీని ప్రత్యేకంగా అడిగాడు. గంభీర్ అడగ్గానే మరోమాట లేకుండా వన్డేలు ఆడేందుకు కోహ్లీ అంగీకరించాడు. దీంతో కోహ్లీ వన్డే జట్టులోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఎదుట కోహ్లీ తెలిపిన విషయాలు తాజాగా బయటకు వచ్చాయి. గంభీర్, తనకు మధ్య ఎలాంటి అపోహలకు వెళ్లాల్సిన అవసరం లేదని బీసీసీఐకి కోహ్లీ భరోసా ఇచ్చాడట.
Also Read
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
Also Read: Suryakumar Yadav: గంటలతరబడి వాడీవేడిగా చర్చ.. సూర్యకే ఓటేసిన ప్లేయర్స్!
‘గౌతమ్ గంభీర్‌తో గతంలో చోటుచేసుకొన్న సంఘటనలు ఏవీ కూడా మా బంధంపై ప్రభావం చూపవు. భారత్ జట్టు కోసం ఇద్దరం కలిసి పని చేస్తాం. మా ఇద్దరి లక్ష్యం టీమిండియాను ముందుకుతీసుకెళ్లడమే. ఈ విషయంలో బీసీసీఐ ఎలాంటి అపోహలకు వెళ్లాల్సిన అవసరం లేదు’ అని బీసీసీఐకి కోహ్లీ భరోసా ఇచ్చినట్లు జాతీయ మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఐపీఎల్ 2023లో లక్నో, బెంగళూరు మ్యాచ్ సందర్భంగా కోహ్లీ, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరగ్గా.. అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఐపీఎల్ 2024లో వీరిద్దరూ ఆలింగనం చేసుకుని.. తమ మధ్య విభేదాలకు పులిస్టాప్ పెట్టారు.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!