Actress Jamuna: జమునకు తొలి చిత్ర అవకాశం చాలా చిత్రంగా లభించింది. ఆమె పక్కింటి బామ్మగారు ఒకామె తమ చుట్టాలబ్బాయి రాజమండ్రిలో ఉన్నాడని, అతను సినిమా తీస్తున్నాడని, నటిస్తావా అని జమునను అడిగింది. ముసలమ్మ వేళాకోళం ఆడుతోందేమోనని జమున ఆ మాటలను సీరియస్ గా తీసుకోలేదు. అయితే ఆ వార్తలో నిజం ఉందని, ప్రజానాట్యమండలికి చెందిన డాక్టర్ రాజారావు స్వీయ దర్శకత్వంలో ‘పుట్టిల్లు’ సినిమా తీస్తున్నారని తెలిసింది. అంతేకాదు… ఆ సినిమాలో ఏకంగా కథానాయికగా జమున ఎంపికైంది. ఈ సినిమాతోనే పాలకొల్లుకు చెందిన అల్లు రామలింగయ్య కూడా నటుడు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. పీలగా, పిలక జడతో ఉండే జమున 13 సంవత్సరాల ప్రాయంలోనే ఆ చిత్రంలో ఛాన్స్ సంపాదించుకోవడం విశేషం.
BIG Breaking: టాలీవుడ్‌లో మరో విషాదం.. వెండితెర సత్యభామ కన్నుమూత..
అయితే ‘పుట్టిల్లు’ సినిమా పరాజయం పాలైంది. అయినా కూడా తనను పరిచయం చేసిన డాక్టర్ రాజారావు పట్ల జమున ఎంతో కృతజ్ఞత కలిగే ఉండేవారు. సినిమాల్లోకి నటిగా ఓ ఉన్నత స్థితికి చేరుకున్నాక తనకు తొలి అవకాశం ఇచ్చిన డాక్టర్ రాజారావు ఇంటికి ఆయనకు తెలియకుండా ప్రతి నెలా సామాన్లన్నీ పంపిస్తూ ఉండేది జమున. డాక్టర్ రాజారావు మరణించిన తర్వాత 1964లో లక్ష రూపాయలు ఖర్చు చేసి మద్రాసు హబిబుల్లా వీధిలో ఒక మేడ కొని ఆయన భార్యకు బహూకరించింది. ఆనాడు జమునకు ఆ సూచన చేసింది నందమూరి తారకరామారావు అని చెబుతుంటారు.