ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ఆగస్టు 2న ఆసియా కప్ 2025 వేదికలను అధికారికంగా ప్రకటించింది. ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లు దుబాయ్, అబుదాబిలలో జరుగుతాయి. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9న అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్, హాంకాంగ్ మధ్య మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది.
Also Read:MLC Kavitha : అందుకే పార్టీకి దూరంగా ఉన్నా
భారత్, పాకిస్తాన్ మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ సెప్టెంబర్ 14 (ఆదివారం)న దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతుంది. భారత్, పాకిస్తాన్ గ్రూప్ Aలో ఉన్నాయి. ఇందులో UAE, ఒమన్ జట్లు కూడా ఉన్నాయి. సెప్టెంబర్ 14న భారత్, పాకిస్తాన్ జట్లు ఖచ్చితంగా తలపడతాయి. రెండు జట్లు సూపర్-4 దశకు అర్హత సాధిస్తే, సెప్టెంబర్ 21న రెండో పోరు జరిగే అవకాశం ఉంది. రెండు జట్లు ఫైనల్స్‌కు చేరుకుంటే, ఈ టోర్నమెంట్‌లో వారు మూడోసారి తలపడే అవకాశం ఉంది.
ఆసియా కప్ గ్రూప్స్
గ్రూప్ ఎ: భారత్, పాకిస్తాన్, యుఎఇ, ఒమన్
గ్రూప్ బి: బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్
Also Read:Honda Elite Pack: హోండా అమేజ్, ఎలివేట్‌కు “ఎలైట్ ప్యాక్” విడుదల.. కొత్తగా వస్తున్న ఫీచర్లు ఇవే!
ఆసియా కప్ షెడ్యూల్
సెప్టెంబర్ 9 – ఆఫ్ఘనిస్తాన్ vs హాంకాంగ్, అబుదాబి
సెప్టెంబర్ 10 – ఇండియా vs యుఎఇ, దుబాయ్
సెప్టెంబర్ 11 – బంగ్లాదేశ్ vs హాంకాంగ్, అబుదాబి
సెప్టెంబర్ 12 – పాకిస్తాన్ vs ఒమన్, దుబాయ్
సెప్టెంబర్ 13 – బంగ్లాదేశ్ vs శ్రీలంక, అబుదాబి
సెప్టెంబర్ 14 – ఇండియా vs పాకిస్తాన్, దుబాయ్
సెప్టెంబర్ 15 – యుఎఇ vs ఒమన్, అబుదాబి సెప్టెంబర్ 15 –
శ్రీలంక vs హాంకాంగ్, దుబాయ్
సెప్టెంబర్ 16 – బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్, అబుదాబి సెప్టెంబర్ 17 –
పాకిస్తాన్ vs యుఎఇ, దుబాయ్ సెప్టెంబర్ 18 –
శ్రీలంక vs ఆఫ్ఘనిస్తాన్, అబుదాబి సెప్టెంబర్ 19
– ఇండియా vs ఒమన్, అబుదాబి సెప్టెంబర్ 20
– బి1 వర్సెస్ బి2, దుబాయ్ సెప్టెంబర్
21 – ఎ1 వర్సెస్ ఎ2, దుబాయ్
సెప్టెంబర్ 23 ఎ2 వర్సెస్ బి1, అబుదాబి
సెప్టెంబర్ 24 – ఎ1 వర్సెస్ బి2, దుబాయ్
సెప్టెంబర్ 25 – ఎ2 వర్సెస్ బి2, దుబాయ్
సెప్టెంబర్ 26 – ఎ1 వర్సెస్ బి1, దుబాయ్
సెప్టెంబర్ 28- ఫైన్, దుబాయ్
🚨 𝗔𝗡𝗡𝗢𝗨𝗡𝗖𝗘𝗠𝗘𝗡𝗧 🚨#ACCMensAsiaCup2025 confirmed to be hosted in Dubai and Abu Dhabi! 🏟️
The continent’s premier championship kicks off on 9th September 🏏
Read More: https://t.co/OhKXWJ3XYD#ACC pic.twitter.com/TmUdYt0EGF
— AsianCricketCouncil (@ACCMedia1) August 2, 2025