Amanatullah Khan : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు రూస్ అవెన్యూ కోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసులో అతనిపై దాఖలైన అనుబంధ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి కోర్టు నిరాకరించింది. అతడిని విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.
కోర్టు ఏం చెప్పింది?
అమానతుల్లా ఖాన్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని, అయితే అతనిని ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి లేదని, అందుకే కాగ్నిజెన్స్ నిరాకరించినట్లు కోర్టు తెలిపింది. రూ. లక్ష పూచీకత్తు పై అమానతుల్లా ఖాన్‌ను తక్షణమే జ్యుడీషియల్ కస్టడీ నుంచి విడుదల చేస్తామని రూస్ అవెన్యూ కోర్టు పేర్కొంది. మరియం సిద్ధిఖీని విచారించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. వచ్చే ఏడాది ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున అంతకంటే ముందే అమానతుల్లా ఖాన్‌కు ఈ ఊరట లభించింది. అమానతుల్లా ఓఖ్లా నుంచి ఎమ్మెల్యే. ఢిల్లీ వక్ఫ్ బోర్డులో జరిగిన కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యాడు.
Read Also:IMD Weather: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. తెలంగాణలో వర్షాలు..
అమానతుల్లాపై వచ్చిన ఆరోపణలేంటి?
సప్లిమెంటరీ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలా వద్దా అనేదానిపై కోర్టు ఇంతకుముందు తన ఆదేశాలను రిజర్వ్ చేసింది. నవంబర్ 14న ఉత్తర్వులు ఇస్తామని కోర్టు తెలిపింది. అమానతుల్లా ఖాన్, మరియం సిద్ధిఖీలపై ఈడీ చార్జిషీట్‌లో పేర్లు ఉన్నాయి. అమానతుల్లా ఖాన్ ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్నప్పుడు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారు. సెప్టెంబర్ 2న ఈడీ అమానతుల్లా ఖాన్‌ను అరెస్ట్ చేసింది.
Read Also:Sanju Samson: సంజూ శాంసన్ చెత్త రికార్డు.. మనోడే తొలి బ్యాటర్!