Punjab: పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే దేవిందర్జీత్ లడ్డీ ధోసే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మోగాలో ఆరోగ్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంపై ఆయన సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. మోగా జిల్లాపై పంజాబ్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమని చూపిస్తోందని అన్నారు. మోగా కోసం ఆరోగ్యమంత్రి కొత్త ప్రాజెక్టుని ప్రకటించకపోవడంతో ధోసే ఆగ్రహం వ్యక్తం చేశారు.
Amanatullah Khan : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు రూస్ అవెన్యూ కోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసులో అతనిపై దాఖలైన అనుబంధ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి కోర్టు నిరాకరించింది. అతడిని విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఏం చెప్పింది? అమానతుల్లా ఖాన్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని, అయితే అతనిని ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి లేదని, అందుకే కాగ్నిజెన్స్ నిరాకరించినట్లు కోర్టు తెలిపింది. రూ. లక్ష…
ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఢిల్లీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మనీలాండరింగ్ కేసులో14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ స్వయంగా కోర్టును అభ్యర్థించింది. ఇకపై నిందితులను కస్టడీలో విచారించాల్సిన అవసరం లేదని ప్రత్యేక న్యాయమూర్తికి ఈడీ తెలిపింది.
అందరూ చూస్తుండగానే పంజాబ్‌లో ఆప్ ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్‌పై ఆమె భర్త చేయి చేసుకున్నారు. ఆమె ఇంట్లో జరిగిన ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక ఎమ్మెల్యే, తన అనుచరుల చేత ఇద్దరు మహిళలపై దాడి చేయించింది. తలపై ఇనప రాడ్లతో కొట్టించింది. నవంబర్ 19 న అర్ధరాత్రి కారులో దిగిన మహిళలపై కొంతమదని గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన తల్లీకూతుళ్లు గాయాల నుంచి కోలుకొని బుధవారం పోలీసులను ఆశ్రయించారు. దీంతో వెంటనే పోలీసులు విచారణ చేపట్టి సీసీ టీవీ ఫుటేజ్ ని పరిశీలించి…