AAP: మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన ఆప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మరో జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారం విడుదల చేసింది. ఇద్దరు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు అభ్యర్థులతో కూడా జాబితా అధిష్టానం విడుదల చేసింది. హోషియార్‌పూర్ నుంచి రాజ్ కుమార్ చబ్బెవాల్, ఆనంద్‌పూర్ సాహిబ్ నుంచి మల్వీందర్ సింగ్ కాంగ్ పోటీ చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Purandeswari: ఎన్నికల సందర్భంలో పింఛన్ పంపిణీని ఎందుకు రాజకీయం చేస్తున్నారు..
Also Read
- Amol Muzumdar: భారత్‌కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
- Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
- Women's Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో ఆప్ సీట్ల షేరింగ్ జరిగింది. ఢిల్లీలో మూడు సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తుండగా.. ఆప్ నాలుగు స్థానాల్లో పోటీ చేస్తోంది. పంజాబ్‌లో మాత్రం ఒంటరిగా బరిలోకి దిగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఐదు రాష్ట్రాల్లో ఆప్ అభ్యర్థులు పోటీ చేస్తారని.. మొత్తం 29 మంది అభ్యర్థులు బరిలోకి దింపుతున్నట్లు ఆప్ నేతలు వెల్లడించారు. తాము పోటీ చేసే ప్రతి సీట్లలో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: CM Jagan: డబుల్ సెంచరీ కొట్టడానికి సిద్ధంగా ఉండాలి..
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మార్చి 21న కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా రెండు సార్లు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఇక ఏప్రిల్ 1న తిరిగి కోర్టులో హాజరుపరచగా ఏప్రిల్ 15 వరకు జ్యుడీసియల్ కస్టడీ విధించింది. దీంతో సోమవారం ఆయన్ను తీహార్ జైలుకు పంపించారు. సార్వత్రిక ఎన్నికల వేళ కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టడంతో పార్టీ ప్రచారం సన్నగిల్లింది. నేతలంతా కేజ్రీవాల్‌పైనే పోకస్ పెట్టారు. దీంతో ప్రచారాన్ని ముందుకు నడిపించేవారు లేక డీలా పడింది. ఇక ఇదే కేసులో ఆప్ నేత సంజయ్ సింగ్‌కు సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Pakistan: హిందూ బాలిక అపహరణ.. సింధ్ వ్యాప్తంగా నిరసనలు..
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది. సెకండ విడత ఏప్రిల్ 26న జరగనుంది. అటు తర్వాత మే 7, 13, 20, 25, జూన్ 1న చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.

తాజావార్తలు
-
Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
-
Amol Muzumdar: భారత్‌కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
-
Shreyas Iyer: అప్పుడు నాకు మరో ఆప్షన్ లేదు.. ఒక ఓవర్‌తో అతడిని నిందించొద్దు!
-
US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!