ప్రస్తుత కాలంలో దంపతులు అనేక అనారోగ్య సమస్యల కారణంగా కొంతమందికి సంతాన విషయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పనిలో పడే టెన్షన్, అలాగే బయట తినే ఆహార పదార్థాల ద్వారా వచ్చే నష్టాలు వల్ల కూడా అనేకమందిలో సంతాన సమస్యలు లేవనెత్తుతున్నాయి. అలాంటి వారి తమకి ఒక్క బాబు లేదా పాప కావాలని దేవులకి ప్రార్థన చేస్తుంటారు. ఓవైపు పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు తనకు మగ బిడ్డ కావాలని ఎదురు చూసిన ఓ మహిళ మరోసారి ఆడపిల్ల పుట్టడంతో ఈ అమానుష సంఘటన చోటుచేసుకుంది.
Also read: Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటి వరకు జైలుకు వెళ్లింది వీళ్లే..?
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా భీమిని మండలం కేస్లాపూర్ గ్రామంలో ఈ అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తనకు బిడ్డ కావాలని ఎదురు చూసినా మూడోసారి కూడా ఆడపిల్లే పుట్టడంతో తీవ్ర నిరాశకు లోనైంది. దాంతో ఆవిడ చేయకూడని పని చేసింది. కనీసం కళ్ళు కూడా తెరవని ఆ చిన్న పాపను నిర్ధాక్షణంగా గ్రామా శివారులో ఉన్న పొలాల్లో విడిచిపెట్టి వచ్చింది. ఆ పాపని గ్రామంలోని వీధి కుక్కలు ఎత్తుకొచ్చి వచ్చి గ్రామంలోని వీధుల్లో పడేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
Also read: Penamaluru: రసవత్తరంగా పెనమలూరు టీడీపీ రాజకీయం..!
గ్రామానికి చెందిన గంగక్క అనే మహిళకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. మొదటి అమ్మాయికి వివాహం కాగా రెండు కుమార్తె కూడా వివాహ వయసుకి వచ్చింది. అయితే గంగక్కకు ఇంత వయసు వచ్చిన కూడా కొడుకు లేడని బాధ ఉండేది. అయితే అదృష్టం కొద్ది మరోసారి గర్భం దాల్చింది. కాకపోతే., ఈసారి కూడా ఆడపిల్ల జన్మించడంతో తీవ్ర ఆవేదనం గురి కావడంతో ఇలాంటి పని చేసింది. గ్రామంలో ఎటువంటి చెడిచప్పుడు చేయకుండా పురిటి బిడ్డను పొలాల్లో వదిలేసి వచ్చింది. అసలు విషయం బయటకు రావడంతో విషయం కాస్త స్థానికులు పోలీసులకు తెలిపారు. గ్రామస్తులు ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, అక్కడ పరిశీలించి కారణమైన గంగక్కను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ ను ఆమెను తరలించారు.