నేటి తరం యువత మంచి చెడులకు తేడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రేమలు, పెళ్లిళ్లు అంటూ కన్నవాళ్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు వయసుతో సంబంధం లేకుండా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లను వాడుతున్నారు. సోషల్ మీడియాను వాడడం తప్పు కాదు కానీ విచ్చలవిడిగా వాడి.. ముఖపరిచయం లేని వ్యక్తులతో స్నేహాలు పెంచుకుని వాటికి ప్రేమ అనే పేరు పెట్టుకుంటే.. అసలుకే ముప్పు వస్తుంది. ఆ తప్పు జరగక ముందే తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి.. మీ పిల్లలపై ఓ కన్ను వేసి ఉంచాలి. సోషల్ మీడియాలో సమాచారం ప్రకారం రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో కిడ్నాప్ అయ్యి కలకలం రేపిన విద్యార్థి కేసులో అసలు నిజం వెలుగు చూసింది.
Read Also: Tamannaah Bhatia Pics: అసలే మిల్కి బ్యూటీ.. అందులోనూ సూపర్ శారీ! తమన్నా లేటెస్ట్ పిక్స్ వైరల్
రూర్కీలోని ఇంజినీరింగ్ కళాశాలకు వెళ్లాల్సిన యువతి హన్సిక వర్మ.. అకస్మాత్తుగా మాయమైనది. ఆ తరువాత కాసేపటికి ఆమె తండ్రి వాట్సాప్ కి ఒక వీడియో వచ్చింది.. అందులో హన్సికని కిడ్నిప్ చేసినట్లు ఉంది. ఆ తర్వాత ఆగంతకులు రూ.10 లక్షల ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. అయితే హన్సిక తండ్రి వెంటనే ఈ విషయాన్ని పోలీసులకి చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, హన్సికని ఎవరు కిడ్నాప్ చెయ్యలేదని ఆమెనే డబ్బు కోసం ఈ కిడ్నాప్ డ్రామా ఆడిందని పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలిసిన హన్సిక తల్లిదండ్రులు ఆశ్చర్యానికి గురైయ్యారు.
Read Also: Game Changer : ఆ పాట కోసం భారీగా ప్లాన్ చేస్తున్న దర్శకుడు శంకర్..?
వివరాల్లో్కి వెళ్తే.. హన్సిక వర్మ ఇంస్టాగ్రామ్ లో పరిచయమైన రాజ్ సింగ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. అయితే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు.. అనుకున్నట్టుగానే పెళ్లి చేసుకున్నారు.. కానీ ఆ పెళ్లితో వాళ్ళకి డబులు కావాల్సి వచ్చి ఇద్దరు కలిసి ఈ కిడ్నాప్ డ్రామాకు ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు. అనుకున్నట్లుగానే ప్లాన్ ప్రకారమే హన్సిక ఒక కిడ్నాప్ వీడియోని తండ్రికి పంపి డబ్బులు డిమాండ్ చేసిందని పోలీసులు వెల్లడించారు. పోలీసులు హన్సికను, తన ప్రియుడు రాజ్ సింగ్ ని అదుపులోకి తీసుకుని వాళ్ళ దగ్గర ఉన్న మ్యారేజ్ సర్టిఫికెట్ ని స్వాధీనం చేసుకున్నారు.