బంజారా హిల్స్ లో యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. పబ్ లో ఎంజాయ్ చేద్దాం రమ్మని పిలిచి.. ఓ యువకుడిని కిడ్నాప్ చేసింది ఓ మహిళ. భర్తతో కలిసి కిడ్నాప్ కు పాల్పడింది. మద్యం మత్తులో ఉన్న యువకుడి నగ్న వీడియోలు తీసి డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడ్డారు. ఆభరణాల షాపు ఉద్యోగిపై భారీ స్కెచ్ వేశారు దంపతులు. యువకుడు హత్యకు గురయ్యాడంటూ టాస్క్ ఫోర్స్ పోలీసుల పేరుతో సినీ ఫక్కీలో డ్రామాకు తెరలేపారు. బాధితుడు బంజారా…
ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత బీజాపూర్ జిల్లాలో ఇద్దరు మాజీ సర్పంచ్‌లను మావోయిస్టులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. జిల్లాలోని నైమెడ్, భైరామ్‌గఢ్ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో మాజీ సర్పంచ్ సుఖ్‌రామ్ అవలం, సుకాలు ఫర్సాలను అనుమానిత మావోయిస్టులు కిడ్నాప్ చేసి హతమార్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
Love Tragedy: తిరుపతి జిల్లాలోని వెంకటగిరిలో ఓ ప్రేమజంట ఆచూకీ కోసం అబ్బాయి అన్న వదినలను అమ్మాయి తరపు బంధువులు బలవంతంగా తీసుకెళ్లారు. బాలాయపల్లి మండలం కడగుంట గ్రామానికి చెందిన పెంచలయ్య, త్రివేణిల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది.
దేశంలో ఏదొక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఓ వైపు కోల్‌కతా ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా.. కామాంధుల్లో మాత్రం భయం పుట్టడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది.
Child Rape: కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై దారుణమైన అత్యాచారం హత్య ఘటన ఇంకా మరవక ముందే, రాజస్థాన్ లోని జోధ్‌పూర్ జిల్లా నుండి ఒక బాలికపై లైంగిక వేధింపుల భయంకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ చెత్త ఏరుకుని జీవించే వారి మూడేళ్ల కుమార్తెపై అత్యాచారం జరిగింది. అయితే, ఉదయం ఓ గుర్తుతెలియని వ్యక్తి పాపను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 3 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ఆలయం…
మణిపూర్‌లో గత కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే అలాంటి వాతావరణమే కొనసాగుతోంది. మంగళవారం రాత్రి పశ్చిమ ఇంఫాల్‌లోని అదనపు ఎస్పీ అమిత్‌సింగ్ ఇంటిపై సుమారు 200 మంది సాయుధులు దాడి చేసి ఆయనతో పాటు మరొకరిని అపహరించుకుపోయారు.
తిరుమల తిరుపతిలో కిడ్నాప్ కలకలం రేపుతుంది. తిరుమల ఆర్టీసీ బస్టాండ్ లో రెండేళ్ల బాబు కిడ్నాప్ కు గురయ్యాడు. రాత్రి రెండు గంటల సమయంలో రిజర్వేషన్ కౌంటర్ దగ్గర కిడ్నాప్ చేశారు. అయితే, శ్రీవారి దర్శనానికి చెన్నైకి చెందిన కుటుంబం వచ్చింది.
నేటి తరం యువత మంచి చెడులకు తేడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రేమలు, పెళ్లిళ్లు అంటూ కన్నవాళ్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు వయసుతో సంబంధం లేకుండా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లను వాడుతున్నారు.
మహిళలకు ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. ఏదో సినిమాలో అన్నట్లు అమ్మ కడుపులో తప్ప మహిళలకు సమాజంలో ఎక్కడా రక్షణ లభించడం లేదు. ఇంట్లో, స్కూళ్లో, ఆఫీస్ లో ఎక్కడ ఆమెకు రక్షణ దొరకడం లేదు. ఆమెకు లైంగిక వేధింపులు సర్వ సాధారణమైపోయాయి.