గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్ గా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ”గేమ్ ఛేంజర్” ఈ సినిమా ను తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ పై ఇప్పటికే భారీ గా అంచనాలు నెలకొన్నాయి..డైరెక్టర్ శంకర్ ఏలాంటి సినిమాను డైరెక్ట్ చేసిన ఆ సినిమాను విజువల్ వండర్ గా తెరకేక్కిస్తారు. అందుకే ఇప్పుడు రామ్ చరణ్ తో చేస్తున్న ఈ సినిమా పై కూడా మెగా ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ రాక పోవడంతో మెగా ఫ్యాన్స్ కాస్త నిరాశ లో వున్నారు.సోషల్ మీడియా వేదిక గా చిత్ర యూనిట్ ను ఎన్నిసార్లు అప్డేట్ అడిగిన ఎలాంటి స్పందన లేకపోవడంతో టీమ్ పై రాంచరణ్ ఫ్యాన్స్ కాస్త కోపంగా ఉన్నారు.
పొలిటికల్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ సినిమా నుండి తాజాగా ఒక అప్డేట్ బాగా వైరల్ అవుతుంది.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశ లో వుంది.. 2023 చివరికల్లా ఈ సినిమాను పూర్తి చేయడానికి మేకర్స్ భారీగా ప్లాన్స్ చేస్తున్నారని సమాచారం..వచ్చే వారం నుండి ఒక సాంగ్ ను కూడా షూట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు.మరి ఈ సాంగ్ కోసం దాదాపు 100 మంది డ్యాన్సర్ల తో రామ్ చరణ్ – కియారా పై సాంగ్ షూట్ జరగనుందట.ఈ సాంగ్ లో ఎప్పుడు చూడని స్థాయి లో విజువల్స్ ఉంటాయని సమాచారం. దీంతో ఈ సాంగ్ పై రోజు రోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.కాగా ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా ను దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.