సండే వస్తే చాలు చాలా మంది చికెన్ తో రకరకాల వంటలను తయారు చేస్తారు.. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ట్రై చేస్తారు..వాటిలో చికెన్ వేపుడు కూడా ఒకటి. చికెన్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. అలాగే మనం వివిధ రుచుల్లో ఈ చికెన్ వేపుడును తయారు చేస్తూ ఉంటాము. చికెన్ ఫ్రై తిని తిని బోర్ కొట్టకుండా ఉండాలంటే దీనిని ఒక్కోసారి ఒక్కో పద్దతిలో తయారు చేస్తూ ఉండాలి.. చాలా రుచిగా ఉండేలా చికెన్ ఫ్రై ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
కావల్సిన పదార్థాలు..
నూనె – 4 టేబుల్ స్పూన్స్,
తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
చికెన్ – అరకిలో,
పెరుగు – 4 లేదా 5 టేబుల్ స్పూన్స్,
పసుపు – అర టీ స్పూన్,
ధనియాల పొడి -ఒక టీ స్పూన్,
కాశ్మీరి చిల్లీ కారం – 2 టేబుల్ స్పూన్స్,
మిరియాల పొడి – అర టీ స్పూన్,
గరం మసాలా – ఒక టీ స్పూన్,
చాట్ మసాలా – అర టీ స్పూన్,
టమాట కిచప్ – 3 టేబుల్ స్పూన్స్,
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్,
ఉప్పు – తగినంత,
తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ,
తరిగిన కొత్తిమీర – కొద్దిగా,
చిన్నగా తరిగిన పచ్చిమమిర్చి – 3,
నిమ్మకాయ – 1..
తయారీ విధానం :
ముందుగా చికెన్ ను ఒకటికి రెండు సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి.. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని పెరుగును తీసుకోవాలి. తరువాత ఇందులో చికెన్ తప్ప మిగిలిన పదార్థాలన్ని వేసి కలపాలి. తరువాత చికెన్ ను వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత మూత పెట్టి 3 గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. అంత సమయం లేని వారు కనీసం ఒక గంట పాటైనా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా చికెన్ ను మ్యారినేట్ చేసుకున్న తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ ను వేసి కలపాలి. దీన్ని ఒక ఐదు నిమిషాలు బాగా వేగనివ్వాలి..ఆ తర్వాత మంటను తగ్గించి ఫ్రై అయ్యేవరకు చిన్నగా కలపాలి.. చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై తయారవుతుంది.. అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయ్యినట్లే.. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి..