సుప్రీంకోర్టులో అమానుష ఘటన చోటుచేసుకుంది. దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై దాడి జరిగింది. బీఆర్.గవాయ్‌పై ఓ న్యాయవాది దాడికి యత్నించాడు. గవాయ్‌పై షూ విసిరాడు. దీంతో కోర్టు ప్రాంగణం ఒక్కసారిగా గందరగోళంగా మారింది.
టీచర్ తన సెల్ ఫోన్ తీసుకున్నరని ఓ విద్యార్థిని ఏకంగా చెప్పుతో కొట్టింది. ఇప్పుడు ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఈ విచారకరమైన ఘటన విశాఖ, విజయనగరం మధ్య దాకమ్మరిలో ఉన్న ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో చోటు చేసుకుంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. యూపీలోని ఫతేహాబాద్‌లో రాష్ట్రీయ శోషిత్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు స్వామి ప్రసాద్ మౌర్య పర్యటిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థి హోతమ్ సింగ్ మద్దతుగా సభలో ప్రసంగిస్తుంగా స్వామి ప్రసాద్ మౌర్యపై ఓ యువకుడు షూ విసిరాడు. అయితే స్వామి ప్రసాద్ మౌర్య తృటిలో తప్పించుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు.. సభా స్థలికి వెళుతున్న స్వామి ప్రసాద్ మౌర్యకు వ్యతిరేకంగా నల్లజెండాలతో నిరసన చేపట్టారు.
ఒకప్పుడు పాములు చూద్దామంటే కనబడని పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజుల్లో వాటి ఆవాసాలను వదిలి ఇళ్లు, కార్లు, బైకుల్లో తిష్టవేస్తున్నాయి. ఎక్కడ వాటికి కాస్త అనుకూలంగా అనిపిస్తే అక్కడే సెటిలైపోతున్నాయి. తాజాగా.. ఓ షూలో నాగుపాము పిల్ల దర్శనమిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూస్తే మీకు గూస్ బంప్స్ రావడం ఖాయం. ఈ వైరల్ వీడియోలో నాగుపాము పిల్ల ఓ షూలో ఉంటుంది.
ప్రపంచకప్‌లో భాగంగా గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 55 పరుగులకే లంక ఆలౌటైంది. ఈ మ్యాచ్లో షమీ, సిరాజ్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో శ్రీలంక బ్యాటర్లకు ఆసియా కప్ను మరోసారి గుర్తు చేశారు. ఇదిలా ఉంటే.. మ్యాచ్ అనంతరం కొందరు క్రికెట్ అభిమానులతో కెప్టెన్ రోహిత్‌శర్మ సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపాడు. అంతేకాదు.. ఓ యువకుడికి రోహిత్ శర్మ తన షూ ఇచ్చి ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇప్పుడు ఆ…
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్యపై ఓ యువకుడు షూ విసిరాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఎస్పీ కార్యకర్తలు నిందితుడిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు.