Viral News : చాలా మందికి తాము పెంచుకుంటున్న జంతువులంటే ప్రాణం. అవి లేకపోతే క్షణం కూడా ఉండలేరు. ఎక్కడికి వెళ్లినా అవి వారి పక్కన ఉండాల్సిందే. మనుషులకంటే కూడా జంతువులనే వారు ఎక్కువగా ప్రేమిస్తారు. ఈ ప్రేమ కుక్కల విషయంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. అవికూడా తమ యజమానిపై అంత ప్రేమను కనబరుస్తాయి. అయితే వీళ్ల అతిప్రేమే వారికి తంటాలు తెచ్చిపెడుతుంది. అమెరికాలో ఓ జంతు ప్రేమికుడు తాను పెంచుకునే కుక్క కోసం సాహసం చేశాడు. సాధారణంగా ఎయిర్ పోర్టులోకి కుక్కల్ని అనుమతించరు. తనతో పాటు కుక్కను తీసుకెళ్లాలని దానిని బ్యాగులో పెట్టి తీసుకెళ్తామనుకున్నాడు. విమానంలోకి లగేజ్‌ని లోడ్ చేసేముందు ఓ ప్రయాణికుడి బ్యాగ్‌ను స్కాన్ చేసిన సిబ్బందికి దొరికిపోయాడు.
Read Also: Elephant Attack: జనావాసాలపై విరుచుకుపడ్డ ఏనుగులు
వివరాల్లోకి వెళితే.. విస్కాన్‌సిన్ నగరంలోని డేన్ కంట్రీ రీజనల్ ఎయిర్‌పోర్ట్ లో ప్రయాణికులకు సంబంధించిన లగేజీని ఎయిర్‌పోర్ట్ సిబ్బంది విమానంలోకి లోడ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడి బ్యాగ్‌ను చెకింగ్ మెషీన్‌లోకి పంపగా అందులో ఓ వస్తువు వారికి తారసపడింది. దీంతో బ్యాగ్‌ను చెక్ చేయగా అందులో బతికున్న కుక్క కనిపించింది. ఇది చూసిన సిబ్బంది ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ విషయాన్ని ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ప్రయాణ సమయాల్లో ఎవరైనా పెంపుడు జంతువులను తెచ్చుకుంటే సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది.
A dog was accidentally sent through the X-ray @MSN_Airport this week. When traveling with any animal, notify your airline & know their rules. At the checkpoint, remove your pet from the bag and send all items, including the empty carrier, to be screened in the machine. (1/2) pic.twitter.com/JLOStCDsir
— TSA_GreatLakes (@TSA_GreatLakes) December 6, 2022