Elephant Attack: వన్య ప్రాణులు అడవులను వదిలి జనావాసాల్లోకి రావడం ఇటీవల సాధారణమైంది. వాటి ఆవాసాలను మనిషి తన స్వార్థం కోసం ధ్వంసం చేస్తుండడంతో ఎటు పోలేక అవి జనావాసాల్లోకి వస్తున్నాయి. చిరుతలు, ఎలుగులు, పెద్ద పులులు, ఏనుగులు ఇలా ఎప్పుడూ ఏవో జంతువులు పరిసర గ్రామాల్లో జనవాసాల్లో దూరుతున్నాయి. ఇలా వచ్చిన పెద్ద పులులు, చిరుతల దాడుల్లో పలువురు ఇప్పటికే ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక ఏనుగులు గ్రామాల్లో చొరబడి ప్రజల ప్రాణాలు తీయడం, పంటలను ధ్వంసం చేయడం లాంటి ఘటనలు చాలా జరిగాయి. తాజాగా తమిళనాడు రాష్ట్రం కోయింబత్తూర్ జిల్లాలోని కడలూరు ప్రాంతంలో ఏనుగుల మంద ఓ గ్రామంలో చొరబడింది. ఏనుగులు జనావాసాలపై దాడి చేయడంతో 50కి పైగా ఇండ్లు ధ్వంసమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు డప్పులు కొడుతూ, బాంబులు కాలుస్తూ ఆ ఏనుగుల మందను వెళ్లగొట్టేందుకు చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. చివరి అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు వచ్చి ఏనుగుల మందను అడవి వైపు మళ్లించారు.
Coimbatore| In Gudalur, more than 50 houses were damaged in wild elephant attack yesterday pic.twitter.com/xN44pn3Nvj
— ANI (@ANI) December 9, 2022