IND vs SL: శ్రీలంక ముందు టీమిండియా 358 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 357 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టాప్ ఆర్డర్లు రాణించడంతో టీమిండియా భారీ స్కోరును నమోదు చేసింది. ఓపెనర్లలో రోహిత్ శర్మ విఫలమైనప్పటికీ, గిల్ 92 పరుగులు, కోహ్లీ 88, శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులు చేశారు. ఇదిలా ఉంటే రవీంద్ర జడేజా కూడా 35 పరుగులు చేశాడు.
Read Also: Subhaman Gill: నాకు ఆ జెర్సీ నెంబర్ అంటేనే ఇష్టం.. కానీ ఈ నెంబర్ వచ్చింది..
ఆ తర్వాత కేఎల్ రాహుల్ 21 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 12 పరుగులు చేశారు. ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్ బ్యాటింగ్ కు దిగారు. అయితే లంక బౌలర్ మధుషంక వేసిన తొలి ఓవర్లోనే కెప్టెన్ రోహిత్ శర్మ 4 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, గిల్ మధ్య మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఒకానొక సమయంలో ఇద్దరు సెంచరీలు చేసే అవకాశమున్నప్పటికీ మధుషంక వేసిన బౌలింగ్ లో ఇద్దరు పెవిలియన్ బాట పట్టారు. మరోవైపు శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషంక ఈ మ్యాచ్ లో చెలరేగాడు. కీలకమైన 5 వికెట్లు తీసి సెంచరీలు చేయడంలో అడ్డుకట్ట వేశాడు. మరో బౌలర్ దుష్మంత చమీర ఒక వికెట్ సాధించాడు.
Read Also: Google: 18 ఏళ్లు పనిచేసినా వదల్లేదు.. కొత్త ఉద్యోగం కోసం వెతుకులాట..