Terrible Incident: మద్యం సేవించి నిత్యం ఇంట్లో గొడవ చేస్తూ కుటుంబాన్ని విసిగిస్తున్నాడని కన్న తండ్రిని కొడుకు హత్యచేశాడు. ఈ దారుణమైన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఉట్ పల్లి ఇంద్రారెడ్డి నగర్ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రారెడ్డి నగర్ కాలనీలో కావలి రాములు కుటుంబం నివాసం ఉంటుంది. అయితే రాములు కుటుంబాన్ని పట్టించుకోకుండా మద్యానికి బానిసయ్యాడు. అంతే కాకుండా.. నిత్యం మద్యం సేవించి కుటుంబ సభ్యులతో రోజూ గొడవపడి విసికించేవాడు. రాములుకి ఇదే పరిపాటిగా మారింది. దీంతో కుటుంబ సభ్యులు రాములుతో విసుగు చెందేవారు. గత రాత్రి రాములు మద్యం సేవించి పక్కనే ఉంటున్న తన చెల్లెలితో గొడవకు దిగాడు.
Read also: Ponguleti Srinivas Reddy: రైతన్నకు భూమీ విషయంలో భయం లేకుండా చేస్తాం..
అసభ్య పదజాలంతో మాటలు మాట్లాడుతూ తిట్లదండకం మొదలు పెట్టాడు. ఇంట్లోలో కాకుండా కుటుంబ పరువును వీధిపాలు చేశాడు. దీంతో రాములు కుమారుడు శివకుమార్, తండ్రిని సముదాయించే ప్రయత్నం చేసిన తనపై కూడా చేయి చేసుకున్నాడు. ఇద్దరి మద్య మాటమాట పెరిగింది. ఆ గొడవ కాస్త ఇంకా పెద్దదైంది. దీంతో తండ్రిపై విసుగు చెందిన కొడుకు శివకుమార్ కోపోద్రోక్తుడై తండ్ర తలపై ఆయుధంతో బలంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతి చెంది మంచంపై పడివున్న రాములు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
KTR Sensational Tweet: బతుకమ్మ, మూసీపై ట్వీటర్ వేదికగా ధ్వజమెత్తిన కేటీఆర్..