LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ రవాణా రంగంలో చరిత్రాత్మక మార్పునకు శ్రీకారం చుడుతూ, భారతదేశపు మొట్టమొదటి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) రైలును గుజరాత్‌లోని సబర్మతి రైల్వే స్టేషన్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సంయుక్తంగా జెండా ఊపి ప్రారంభించారు. సంప్రదాయ డీజిల్ ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించి, రైల్వే కార్యకలాపాల్లో ప్రత్యామ్నాయ హరిత ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. ఈ ప్రయోగాత్మక ప్రాజెక్ట్ ద్వారా రైలు రవాణాలో ఇంధన సామర్థ్యం పెరగడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయనున్నారు. రైల్వే వ్యవస్థ పనితీరును ఏమాత్రం తగ్గించకుండా, డీజిల్ వాడకాన్ని గణనీయంగా తగ్గించవచ్చని నిరూపించేందుకు ఈ సాంకేతికతను తీసుకువచ్చారు.
సబర్మతి ఇంటిగ్రేటెడ్ కోచింగ్ డిపోలో రెండు 1,400 హెచ్‌పీ సామర్థ్యం గల డ్రైవింగ్ పవర్ కార్లను (DPC) డీజిల్-ప్లస్-ఎల్ఎన్జీ డ్యూయల్-ఫ్యూయల్ సిస్టమ్‌గా విజయవంతంగా మార్చారు. ఈ అత్యాధునిక సాంకేతికతకు సంబంధించి ఇప్పటికే రెండు వేలకు పైగా కిలోమీటర్ల మేర క్షేత్రస్థాయి ట్రయల్స్ పూర్తయ్యాయి. ఈ డ్యూయల్-ఫ్యూయల్ విధానం ద్వారా డీజిల్ వినియోగాన్ని సుమారు 40 శాతం వరకు ఎల్ఎన్జీతో భర్తీ చేయవచ్చు. అంతేకాకుండా, ఇంధన లభ్యతను బట్టి ఇంజిన్ ఆటోమేటిక్‌గా ఎల్ఎన్జీ లేదా డీజిల్‌కు మళ్లే విధంగా దీన్ని రూపొందించడం వల్ల ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ కూడా లభిస్తుంది. మార్పు చేసిన ప్రతి డీపీసీలో సుమారు 2,200 లీటర్ల సామర్థ్యం గల ఎల్ఎన్జీ ట్యాంక్ ఉంటుంది. ఇది సుమారు 850 నుంచి 900 కిలోల ఎల్ఎన్జీని నిల్వ ఉంచుతుంది. ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే సుమారు 1,600 కిలోమీటర్ల ప్రయాణం చేయవచ్చు.
Also Read
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
- Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
అమిత్ షా అహ్మదాబాద్ పర్యటనలో భాగంగా ఈ ప్రాజెక్ట్‌తో పాటు సుమారు 1,542 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందులో భాగంగా సబర్మతిలో 700 కోట్ల రూపాయలతో నిర్మించిన డబ్ల్యూఏజీ-12 లోకోమోటివ్ మెయింటెనెన్స్ షెడ్‌ను ప్రారంభించి, డబ్ల్యూఏజీ-12 ఎలక్ట్రిక్ లోకోమోటివ్ను జెండా ఊపి ప్రారంభించారు. అలాగే అహ్మదాబాద్-పాలన్పూర్ , అహ్మదాబాద్-సమఖియాలి సెక్షన్లలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ‘కవచ్’ రైలు రక్షణ వ్యవస్థ, ఆటోమేటిక్ సిగ్నలింగ్, సబర్మతి-సార్ఖేజ్ సెక్షన్ డబ్లింగ్ పనులను ప్రారంభించారు.
తాజావార్తలు
-
LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
-
Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
-
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
-
KPHB: హైదరాబాద్‌లో చీటీల పేరిట రూ.16 కోట్ల కుచ్చుటోపీ
-
IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?