Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karthi: తమిళనాడు రాజకీయ యవనికపై కొత్త పార్టీలు గద్దెనెక్కినా, పాత పార్టీలు పాలించినా క్షేత్రస్థాయిలో మారేదేమీ లేదంటూ స్టార్ హీరో కార్తి చేసిన కామెంట్స్ ప్రస్తుతం కోలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎన్నికల వేళ రాజకీయ నేతలు ఇచ్చే ఆర్భాటపు హామీలు అధికారం దక్కగానే కాగితాలకే పరిమితమవుతున్నాయన్న పచ్చి నిజాన్ని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రజల ప్రాణాలను, శాంతిభద్రతలను కాపాడేందుకు ఆహార నిద్రలు మాని రాత్రింబవళ్లు శ్రమిస్తున్న పోలీసుల సమస్యలపై ఆయన సూటిగా విజయ్ సర్కార్‌ను నిలదీసిన తీరు చర్చనీయాంశంగా మారింది.
కోయంబత్తూరులో మాజీ పోలీస్ అధికారుల సంక్షేమ ట్రస్ట్ 10వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కార్తి, పోలీస్ సిబ్బంది ఎదుర్కొంటున్న మానసిక, శారీరక ఒత్తిడిపై గళమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో డీఎంకే ప్రభుత్వం అయినా, ఇప్పుడు కొత్తగా పగ్గాలు చేపట్టిన టీవీకే (తమిళగ వెట్రి కళగం) ప్రభుత్వం అయినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు తీసుకురాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీల హామీలు అమలుకు నోచుకోలేదు.. ఇప్పుడొచ్చిన ప్రభుత్వం కూడా పోలీసులకు వారంలో ఒక రోజు సెలవు (వీక్లీ ఆఫ్) ఇస్తామని గంభీరంగా చెప్పినప్పటికీ, అది ఉత్తర్వులకే పరిమితమైందని ఎండగట్టారు.
Also Read
- Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
- OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
- Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. 'ది ప్యారడైజ్'లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
- ‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
సమాజం కోసం నిరంతరం విధుల్లో ఉండే పోలీసులకు కనీసం వారాంతపు సెలవు ఎందుకు ఇవ్వడం లేదని కార్తి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. “ఆఫీసర్లకు కనీస విశ్రాంతి కల్పించకపోతే వారి ఆరోగ్యం, కుటుంబ జీవితం తీవ్రంగా దెబ్బతింటాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేసి సిబ్బందికి వీక్లీ ఆఫ్ కేటాయించాలి” అని డిమాండ్ చేశారు. ‘ఖాకీ’ చిత్రంలో నిజాయితీగల పోలీస్ అధికారిగా నటించిన అనుభవంతో వారి కష్టనష్టాలు తనకు తెలుసని పేర్కొన్న ఆయన, నేర పరిశోధనలో అంకితభావంతో పనిచేసే నిజాయితీపరులైన అధికారులకు మీడియా సైతం బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరో నేరుగా ప్రభుత్వ విధానాల వైఫల్యాన్ని ప్రశ్నించడంతో ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
-
KPHB: హైదరాబాద్‌లో చీటీల పేరిట రూ.16 కోట్ల కుచ్చుటోపీ
-
IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
-
Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
-
Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?