Kalki 2898 AD : పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD సినిమా ప్రపంచ వ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. వసూళ్ల పరంగా కూడా కల్కి సినిమా దుమ్ము లేపుతోంది. ఇప్పటికే 55 కోట్ల వసూలను రాబట్టిన సినిమా ఈ వారం చివరకు వేయి కోట్ల మార్కును దాటేసే దిశగా కలెక్షన్లను రాబడుతోంది. అయితే ప్రస్తుతం భారతదేశంలో పూర్తిగా కల్కి సినిమా మానియ మాత్రమే ఉండడంతో వచ్చే వారంలో విడుదలయ్య సినిమాలో కనబడడం లేదు.
Stock Market : చరిత్ర సృష్టించిన స్టాక్ మార్కెట్లు.. బడ్జెట్ కు ముందు 80000వేలు దాటిన సెన్సెక్స్
ఇకపోతే ఉత్తర భారత దేశంలో కూడా కల్కి తన ప్రదర్శనలను బాగానే కొనసాగిస్తోంది. ఈ దెబ్బతో బాలీవుడ్లో రిలీజ్ అవ్వాల్సిన ఓ స్టార్ హీరో సినిమా వాయిదా వేస్తున్నట్టుగా సమాచారం. హీరో అజయ్ దేవగన్, హీరోయిన్ టబు నటించిన చిత్రం “ఔరోన్ మెయిన్ కహాన్ దం తా”. ఈ సినిమా కల్కి కారణంగా వచ్చే వారానికి రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఒకవేళ అలా కాదని సినిమా రిలీజ్ చేస్తే కల్కి సినిమా ఎఫెక్ట్ ఆ సినిమాపై పడుతుందన్న నేపథ్యంలో ఆ చిత్ర యూనిట్ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం పై సినిమా మేకర్స్ నుండి త్వరలో అధికారిక క్లారిటీ కూడా రాబోతుంది. నీరజ్ పాండే ఈ సినిమాకి దర్శకత్వం వహించగా.. ఫ్రైడే ఫిలిం వర్క్స్, ఎన్హెచ్ స్టూడియోస్ కలిసి చిత్రాన్ని నిర్మించారు.
Gandhi Hospital: నా ఆరోగ్యం సరిగా లేదు.. దీక్ష విరమించిన మోతిలాల్ నాయక్..