Khushi: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెల్సిందే. నా రోజా నువ్వే అంటూ రిలీజ్ అయిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇకపోతే ఈ సాంగ్ తలదన్నేలా మరో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆరాధ్య అంటూ సాగిన ఈ సాంగ్ సైతం సంగీత అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సాంగ్ కు డైరెక్టర్ శివ నిర్వాణనే లిరిక్స్ ఇవ్వడం విశేషం.
Ghost: పవన్ కన్నా ముందు OG నేనే అంటున్న స్టార్ హీరో
ఇక వీడియోలో సమంత- విజయ్ కు పెళ్లి అయ్యినట్లు చూపించారు. పెళ్లి తరువాత కొత్త జంట ఎలా ఉంటారు అనేది సాంగ్ లో తెలిపారు. కొత్త జంటగా సామ్, విజయ్ అదరగొట్టారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకొంటుంది. రొమాంటిక్ సీన్స్ సైతం ఉన్నట్లు కనిపిస్తున్నాయి. సిద్ శ్రీరామ్, చిన్మయి వాయిస్ ఈ సాంగ్ ను వేరే లెవెల్ కు తీసుకువెళ్లాయి. నా రోజా నువ్వే సాంగ్ కన్నా ఆరాధ్య సాంగ్ మరింత సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు. పెళ్లి తరువాత ఒక కొత్త జంట జీవితంలో ఏర్పడిన సంఘటనల సమూహారమే ఖుషీ సినిమా అని తెలుస్తోంది. టక్ జగదీశ్ సినిమాతో భారీ పరాజయాన్ని అందుకున్న శివ నిర్వాణ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.