Faria Abdullah Comments on Women empowerment: బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో స్త్రీ సమిట్- 2023 ఘనంగా జరిగింది. స్త్రీల యొక్క గౌరవం, సమానత్వం, వంటి అంశాలపై అవగాహన కల్పించడమే ద్యేయంగా స్త్రీ సమ్మిట్ జరుగుతోంది. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ HCSC ఆధ్వర్యంలో బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అట్టహాసంగా ప్రారంభమైంది. హైదరాబాద్ కమిషనర్ సివీ ఆనంద్ ఆధ్వర్యంలో స్త్రీ సమ్మిట్ 2023 జరగనుండగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీ నటి ఫరియా అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ జీవితంలో నిజాయితీ పారదర్శకత ఉన్నత స్థాయికి తీసుకువెళుతుందని, జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా స్త్రీలు తమ లైఫ్ ను బ్యాలెన్స్ చేయాలని అన్నారు. ఇక ఎన్నో ప్రాంతాలు తిరిగాను కానీ తెలంగాణలో స్త్రీలకు ఉన్న గౌరవం, ఇక్కడి వారు ఇచ్చే ప్రాధాన్యత చాలా గొప్పదని ఆయన అన్నారు. నేను హైదరాబాదీ అయినందుకు గర్వంగా ఉందన్న ఫరియా తాను ఒక స్వేచ్చాయుత కుటుంబం నుండి వచ్చానని చెప్పుకొచ్చింది.
Mythri Movie Makers: మలయాళ ఇండస్ట్రీలోకి మైత్రీ మూవీ మేకర్స్.. టోవినో థామస్‌తో భారీ బడ్జెట్ మూవీ
ఇక తాను సినిమా ఇండస్ట్రీలో రాణించేందుకు తన పేరెంట్స్ ఎంకరేజ్ చేశారని పేర్కొన్న ఫరియా అబ్దుల్లా నా సక్సెస్ లైఫ్ కి సీక్రెట్ మా ఆమ్మ & నా లైఫ్ కి హీరో మా అమ్మేనని అన్నారు. ఆమెనే ఫెయిల్యూర్ లైఫ్ సక్సెస్ దిశగా తీసుకువెళుతుందని, జీవితంలో ఎదిగేందుకు మరిన్ని విషయాలు నేర్చుకుంటున్నానని అన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను నాకు మరింత మాస్ సపోర్ట్ కావాలని పేర్కొన్న ఆమె మరో కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. స్త్రీలు అలాగే పురుషులు ఎప్పటికీ సమానం కాదని పేర్కొన్న ఆమె స్త్రీ శక్తి చాలా గొప్పదని అన్నారు. మల్టిపుల్ టాస్క్ చేయడంలో స్త్రీలని మించిన వారు లేరని, స్ట్రెంత్ , ఎడ్యుకేషన్, క్రియేషన్, ఎంకరేజ్మెంట్, ప్రొఫెషన్, ఫ్యామిలీ సపోర్ట్ సొసైటీ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ స్త్రీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఆమె చేసిన కామెంట్లపై మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి.